యం.ఎన్.ఆర్ ఫిలిమ్స్ పతాకంపై  నర్రా శివనాగేశ్వర్ రావు (శివనాగు) దర్శకత్వంలో  సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో  నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. యం.ఎన్.ఆర్ చౌదరి  నిర్మాతగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. సీనియర్ నటి జమున కీలక పాత్రలో కనిపించనున్నారు.. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈరోజు  ప్రసాద్ లాబ్స్ లో  ప్రముఖ నిర్మాత, సి. కళ్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో....

నిర్మాత యమ్.ఎన్ ఆర్ చౌదరి మాట్లాడుతూ - " ఒక మంచి సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు శివనాగు ఈ సినిమాను ఎంతో అందంగా తెరకెక్కించారు. అలాగే మాస్టర్ రవితేజ మంచిపెర్ఫామెన్స్ఇచ్చాడు.నేనునిర్మాతగావ్యవహరిస్తున్న తోలి సినిమాలో అన్నపూర్ణమ్మ, జమున లాంటి లెజెండరీ యాక్టర్స్ నటించడం నిజంగా నా అదృష్టం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ లో ఆడియో విడుదల చేసి అక్టోబర్ లో సినిమా విడుదల చేస్తాం" అన్నారు.

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ - " చాలా కాలం తరువాత మళ్ళీఒక మంచి పాత్రలో మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు శివ నాగు నాకు చాలా కాలంగా తెలుసు. ఎన్నో మంచి సినిమాలను రూపొందించాడు. చాలా డిసిప్లేన్డ్ డైరెక్టర్. అలాగే నా మనవడిగా యాక్ట్ చేసిన మాస్టర్ రవితేజ ఒక చిచ్చర పిడుగు. పుట్టుకతోనే నటన నేర్చుకొని వచ్చాడు. మంచి భవిష్యత్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో నాతో పాటు జమున, రఘబాబు ఇలాఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు నటించారు" అన్నారు.

హీరో తారక రత్న మాట్లాడుతూ - " శివ నాగు గారి దర్శకత్వంలో దేవినేని సినిమా చేస్తున్నాను. సినిమా మీద ఎంతో ఇష్టంతో పని చేస్తారు. అలాగే అన్నపూర్ణమ్మ గారితో ఒక సినిమా చేశాను. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈ సినిమా ద్వారా యూనిట్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను"అన్నారు.

చిత్ర దర్శకుడు శివనాగేశ్వర రావు ( శివ నాగు ) మాట్లాడుతూ - " మంచి కంటెంట్ ఉన్న స్టోరీ. నా సినిమా కథ చెప్పగానే ఈ సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్ననిర్మాత చౌదరి గారికి థాంక్స్. ఆయన ఈ సినిమాలో ఎస్పీ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అలాగే అన్నపూర్ణమ్మ గారి సోదరి క్యారెక్టర్ లో సీనియర్ మహానటి జమున గారు నటించారు. బెనర్జీ, రగుబాబు, ఇంకా ఎంతో మంది సీనియర్స్ ఈ సినిమాలో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. త్వరలోనే 200 లకు పైగా థియేటర్స్ లో సినిమాను విడుదల చేయనున్నాం " అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: