మొన్న జరిగిన ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అనేక ఆసక్తికర విషయాల పై స్పందించింది. మహిళా జర్నలిస్టు హేమ అడిగిన అనేక లోతైన ప్రశ్నలకు రేణు ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానాలు ఇచ్చింది. 

ఈ ఇంటర్వ్యూలో మరొక ఆసక్తికర విషయం ఆమె బయటపెట్టింది. తాను తన పిల్లలతో కలిసి త్వరలో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న విషయాన్ని రేణు బయట పెట్టింది. తాను రైతుల సమస్యల పై ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కోసం దర్శకత్వం వహించబోతున్న మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలియచేస్తూ ఆమూవీ నిర్మాణ పనుల కోసం తాను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నట్లు తెలియచేసింది. 

అంతేకాదు మంచి పాత్రలు లభిస్తే తాను నటిగా కూడ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం ఉన్న నేపధ్యంలో కథలు వినడానికి షూటింగ్ కు అందుబాటులో ఉండటానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తన కెరియర్ కు సంబంధించిన ఆలోచనలు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తన పిల్లల భవిష్యత్ ఆలోచించి కూడ తాను ఇక శాస్వితంగా హైదరాబాద్ లోనే ఉండాలని ఆలోచిస్తున్న విషయాలను బయటపెట్టింది. 

ఇదే ఇంటర్వ్యూలో ఆమె రెండవ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు రేణు ఆ విషయాల పై సమాధానాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీనితో రెండవ పెళ్లి విషయంలో రేణు దేశాయ్ ఆలోచనలు మారిపోయయా అన్న సందేహాలు ఆ ఇంటర్వ్యూ చూసిన వారికి ఏర్పడతాయి. తాను పవన్ కళ్యాణ్ తో విడిపోయినా తన పిల్లలకు పవన్ కు మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి అంటూ రేణు దేశాయ్ అన్న మాటలను బట్టి పవన్ సూచనమేరకే రేణు తన షిఫ్టింగ్ కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుందా అన్న సందేహాలు కూడ కొందరికి వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: