టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో ఒకటైన మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ ఇప్పటివరకు ఎవరికి వారు విడివిడిగానే హీరోలుగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మధ్యలో చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్ లీ వంటి సినిమాల్లో మెగాస్టార్ చిన్న క్యారెక్టర్స్ లో తళుక్కున మెరిశారు. అయితే మెగా ఫ్యాన్స్ కు మాత్రం వారిద్దరూ కలిసి పూర్తి స్థాయి క్యారెక్టర్స్ తో ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఎప్పటినుండో కోరుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు అటువంటి అవకాశం రాలేదు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అతిత్వరలో మెగాస్టార్, 

మెగాపవర్ స్టార్ కలిసి ఒకే సినిమాలో నటించే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు. ఆ సినిమాను టాలీవుడ్ కి చెందిన ఒక బడా డైరెక్టర్ తెరకెక్కించనున్నారట. అయితే ఇప్పటివరకు మెగాస్టార్ తో కానీ మెగాపవర్ స్టార్ తో కానీ పనిచేయని ఆ దర్శకుడు, వారిద్దరిని కలిపి ఒకే సినిమాలో చూపించేందుకు అద్భుతమైన కథను కూడా సిద్ధం చేసాడట. అంతేకాక ఇటీవల ఆ కథను మెగాస్టార్ కు కూడా వినిపించడం జరిగిందని, ఆ సమయంలో చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆయన వినడం జరుగలేదని, అయితే కథ అద్భుతంగా ఉందని, తన ప్రస్తుత కమిట్మెంట్స్ అలానే చరణ్ కమిట్మెంట్స్ కూడా పూర్తి కాగానే ఈ సినిమాను మొదలెడదామని ఆ దర్శకుడికి మెగాస్టార్ మాటిచ్చినట్లు సమాచారం. అయితే ఆ దర్శకుడు ఎవరు అనే దానిపై ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైందట. 

ఇది కనుక వర్కవుట్ అయితే ఎప్పటినుండో ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న మెగాభినుల చిరకాల కోరిక ఈ సినిమాతో తీరుతుందని అంటున్నారు. అయితే ఈ వార్త నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు మెగా ఫ్యామిలీల నుండి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో దీనిని పూర్తిగా విశ్వసించలేమని, ఏదైనా కూడా వారినుండి ఒక ప్రకటన వస్తేనే ఈ వార్తను నమ్మలేం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ ఒకవేళ ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, అది మెగా ఫ్యాన్స్ కు మాములు పండుగకాదు, అతి పెద్ద కన్నుల పండుగే అని చెప్పాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: