ఆగస్టు 30న  ‘సాహో’ సినిమా విడుదల కానుంది.  దీని కోసం ప్రచారాన్ని ఆ చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లు,  పాటలు, విడుదల చేసి ఫాన్స్ ను  ఆకర్షించారు. ఇప్పుడు  'సాహో' టీమ్ తాజాగా 'సాహో' లో నటించే  నటీనటుల క్యారెక్టర్ పోస్టర్లు ఒక్కొక్కటిగా విడుదల చేయడం ప్రారంభించింది.  మొన్న  మొదటి క్యారెక్టర్ పోస్టర్ అంటూ  విలన్  బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ పోస్టర్ ను విడుదల చేశారు. దానికి చాలా మంచి స్పందన వచ్చింది.


నేడు సినిమా లో‌ని "దేవరాజ్" మరియు "ఇబ్రహిం" పాత్రలను విడుదల చేశారు.  చుంకీ‌ పాండే "దేవరాజ్" పాత్రను పోషిస్తుండగా  "ఇబ్రహిం" పాత్రను లాల్ (ఎం. పి. మైఖేల్) పోషిస్తున్నారు.

చుంకీ పాండే  పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో  కామెడియనా గా నటించాడు. ఇప్పుడు  విడుదలైన సాహో సినిమా పోస్టర్ లో  యాక్షన్ క్యారెక్టర్ గా కనిపిస్తున్నాడు. అలానే మళయాళం లో‌ ఎన్నో‌ విలక్షణ మైన సినిమాలకు కథను అందించి,దర్శకత్వం వహించి, నటించిన లాల్ కుడా ఇందులో‌ ఒక ప్రధాన పాత్ర పోషిస్తునారు. ఇప్పటి వరకు సాహో‌  సినిమా కి  సంభందించి విడుదల అయిన అన్నీ  కూడా సినిమా స్థాయి ని ఇంకా పై పైకి తీసుకు వెళ్తునాయి.

యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని   అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరెకెక్కిస్తున్నారు.  ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలు భాషలలో‌  విడుద‌ల చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: