బిగ్ బాస్ మూడవ వారంలో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల వల్ల ఒక్కొక్కరు ఏంటనేది బయటపడుతుంది.. మొన్నటి వరకు చాలా సాఫ్ట్ అనుకున్నవారు కూడా వారి నిజ స్వరుపంతో వారేంటనేది తెలియజేస్తున్నారు. తమన్నా, రవిక్రిష్ణ విషయంలో ఎంత అతిగా ప్రవర్తించిందో అందరికీ తెలుసు. పర్సనల్ గా అటాక్ చేసి మరీ అతన్ని ఇరిటేట్ చేసింది. దీంతో తమన్నా పై సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే.


తమన్నా విషయంలో రాహుల్ రవిక్రిష్ణ వైపు స్టాండ్ తీసుకుని వాదించడం వల్ల ప్రేక్షకుల్లో రాహుల్ పై అభిమానం పెరిగింది. గొడవని తగ్గించే దిశగా ఆయన ప్రయత్నించడంతో ప్రేక్షకుల నుండి అతనికి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే దాన్ని రాహుల్ ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయాడు. నిన్న ఆయన  చేసిన పనితో  జీరో అయ్యాడు. ఎక్కడైతే తను హీరో అని ఫ్రూవ్ చేసుకున్నాడో అక్కడే తను జీరో అయ్యాడు.


ఆలీ , హిమజ ల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు హౌస్ మెంబర్ గా ఆ గొడవని తగ్గించే ప్రయత్నమే చేయాలి. కానీ రాహుల్ గొడవని ఇంకా పెద్దగా చేసేలా మాట్లాడటమే నచ్చలేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. తప్పు చేసాక సారీ చెప్పడం ఏంటని అతను మాట్లాడిన తీరు సరిగ్గా లేకపోవడంతో అతని ప్రవర్తనపై రకరకాల వార్తలు వస్తున్నాయి. 


ఇక్కడ తమన్నాకి మంచి మార్కులు పడ్డాయి. హిమజ ఏడుస్తుంటే అమె వైపు నిలబడి ఆలీ, హిమజ ల్ మధ్య గొడవని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం నిజంగా గొప్ప విషయం. అయితే ఆలీ దాని గురించి పట్టించుకోకుండా తమన్నాని టూ ఫేస్ అనడం బాగోలేదని వాదిస్తున్నారు. నిన్నటి వరకు విలన్ గా కనిపించిన తమన్నా ఈ ఒక్క చర్యతో హీరో అయ్యింది. గొడవని పెద్దగా చేయాలని చూసిన రాహుల్ జీరో అయ్యాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: