ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా నటిస్తున్నా, స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా, కాజల్ అగర్వాల్ కు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆమెను ఇప్పటికీ అందరూ గ్లామర్ డాల్ గా అభివర్ణిస్తారే తప్పించి తన నటన గురించి ఎన్నడూ మెచ్చింది లేదనే చెప్పాలి. మొన్నా మధ్య వచ్చిన 'సీత' సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చినా ఆ సినిమా కూడా వైఫల్యాన్ని చవిచూసింది. కాజల్ నటన గురించి కూడా ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు.


ఇప్పుడు తను ఒక కుర్ర హీరోయిన్ కి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం విడుదల కు సిద్దంగా ఉన్న 'రణరంగం' చిత్రం లో కూడా మొదటి నుంచి కల్యాణి ప్రియదర్శన్ మెయిన్ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇదే చిత్రంలో మరో హీరోయిన్ అయినా కాజల్ ఇందుకు నొచ్చుకుందో ఏమో… కళ్యాణి కన్నా ముందే ప్రమోషన్లు మొదలు పెట్టేసింది. మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. సినిమాలో తనది అత్యంత కీలకమైన పాత్ర అని పేర్కొంది. కథ మలుపు తిరిగేది తన క్యారెక్టర్ వల్లే అని నొక్కి వక్కాణించింది.

తను ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేసినట్లు, రెండో భాగంలో తన పాత్ర వచ్చినప్పటి నుండే చిత్రం మలుపు తిరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే చాలామంది తనని సెకండ్ హీరోయిన్ గా ఎందుకు చేసావ్ అని అడిగారని గొప్పలు చెప్పకుంది. ఈ చిత్రంలో తనవి చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అని… తన వల్లే కదా ముందుకు నడుస్తుంది అని…. చిత్రం చూశాక కానీ ఎందుకు ఈ సినిమాకి ఒప్పుకుందో మీకే తెలుస్తుందని అని సమాధానమిచ్చింది.


కాజల్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూసి అందరికీ ఈ పాటికే విషయం అర్థం అయిపోయింది. పేరు కోసం తను పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. మరి కళ్యాణి ప్రియదర్శన్ ను సినిమాలో కాజల్ ఎంతవరకు డామినేట్ చేస్తుందో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: