ఏజ్ బార్ హీరోలంటేనే ఇపుడు మొహం మొత్తిందా. వారి వయసుకు తగ్గ పాత్రలు వేయకపోతే కట్ చెప్పేస్తున్నారా అంటే అవుననే పరిణామాలు చెబుతున్నాయి. నిన్న అజయ్ దేవగన్, ఈ రోజు నాగార్జున, మొన్న బాలక్రిష్ణ, అంతకు ముందు వెంకటేష్ ఇలా సీనియర్ హీరోలు వరస తప్పి సరసాలు ఆడితే గట్టిగా షాక్ ఇచ్చేస్తున్నారు. అలా ఇలా కాదు డిజాస్టర్లతోనే తిప్పి పంపిస్తున్నారు. 


ఒకప్పుడు అరవైల్లో హీరోలు పదహారేళ్ళ శ్రీదేవితో ఆడిపాడితే ఒప్పుకున్నారు. చప్పట్లు కొట్టారు. ఒకటా రెండా డజన్లో కొద్దీ సినిమాలు హిట్ చేసి పంపారు. ఇపుడు కాలం మారింది. ఫార్టీ యియర్స్ కే సీనియర్స్ ని చేసేస్తున్నారు. ఈ నేపధ్యంలో నాగార్జున డేరింగ్ డాషింగ్ గా మన్మధుడు టు మూవీ తో వచ్చాడు. ఈ మూవీలో ఆయన కుర్ర వేషాలు ఎన్నో వేశారు.


నాగ్ రొమాన్స్ ని జనం నచ్చలేదని సినిమాకు వచ్చిన టాక్ చెబుతోంది. పైగా సినిమా కధ కూడా ఓల్డ్, రొడ్డకొట్టుడు. దాంతో నాగ్ భారీ ఫ్లాప్ ఎదుర్కోవాల్సివచ్చింది. ఇదే పరిస్థితి ప్యార్ దే ప్యార్ అంటూ వచ్చిన  అజయ్ దేవగన్ మూవీకి ఎదురైంది. ఆయన కూడా ముసలి వయసులో పడుచు సరదాలు చేశారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.


ఇక బాలక్రిష్ణ పైసా వసూల్ కూడా ఇలాంటి డిజాస్టరే. అందులో బాలయ్య వయసు కి మించి పిల్ల చేష్టలు చేశారు. దాంతో ఆ మూవీని జనం తిప్పికొట్టారు. అదే విధంగా అప్పట్లో వెంకటేష్ నటించిన మూవీ షాడో. అందులో వెంకీ వేసిన వేషాలకు ఆడియన్స్ నో అనేశారు. ఆ మూవీ వెంకీ కెరీర్లో భారీ ఫ్లాప్ ని మూటకట్టుకుంది. దీని బట్టి అర్ధమయ్యేనేంటి అంటే వయసుకు తగ్గ వేషాలు వేస్తేనే చూస్తామని సందేశం ఇచ్చారన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: