ఆర్ ఎక్స్ 100 చిత్రంలో లీడ్ రోల్‌లో న‌టించి త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఒక్క చిత్రంతోనే తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. హీరోయిన్ అంటే కేవ‌లం గ్లామ‌ర్‌కి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వ్వ‌కుండా మొద‌టి చిత్రంలోనే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. కార్తికేయ హీరోగా, నూతన దర్శకుడు అజయ్ భూతిపతి తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లతో ఘనవిజయం సాధించింది.


కాగా నటి పాయల్ రాజ్ పుత్ తాజాగా “ఆర్ డి ఎక్స్ లవ్” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఇటీవల విడుదల చేయడం జరిగింది. పాయల్ ఈ చిత్రంలో కూడా కొంచెం బోల్డ్ గా ఉండే పాత్రలో కనిపించనుందని సమాచారం. నేడు విడుదల చేసిన మరో పోస్టర్ లో రెడ్ డ్రెస్ లో పాయల్ గ్లామర్ చిందిస్తూ హీటెక్కిస్తోంది. ఆ ఫోటోలు చూస్తుంటే మళ్ళీ కుర్రకారు గుండెల్లో రెడ్ అలర్ట్ మొదలవడం ఖాయంగా కనిపిస్తుంది.


తేజు కంచెర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తుండగా,దర్శకుడు శంకర్ భాను తెరకెక్కిస్తున్నాడు. రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక‌పోతే పాయ‌ల్ ఎక్కువ‌గా బోల్డ్ పాత్ర‌లే ఎంచుకోవ‌డంలోని ప్ర‌త్యేక‌త ఏమ‌యి  ఉంటుంది.  ఆ పాత్ర వ‌ల్ల త‌న‌కు పేరు వ‌స్తుంద‌ని భావిస్తూ అలాంటి పాత్ర‌లు న‌టించ‌డానికి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఆమె బాడీ స్ట్ర‌క్చ‌ర్ మొత్తం ఎక్కువ‌గా బోల్డ్ క్యారెక్ట‌ర్స్‌కి బాగా సూట్ అవుద్ది.  అంతే కాక ఆమె క‌ళ్ళు చాలా మ‌త్తుగా ఉంటాయి. అలాగే ఆమె హావ‌భావాల‌న్నీ ఇలాంటి క్యారెక్ట‌ర్స్‌కి చాలా బాగా సూట్ అవ్వ‌డంతో సూప‌ర్  అనిపిస్తాయి.  మొత్తానికి ఆర్‌డిఎక్స్ భామ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: