సెన్సేషనల్ హీరో  'విజయ్ దేవరకొండ' కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే  ఈ సెన్సేషనల్ హీరో తమ్ముడిగా 'దొరసాని'తో  హీరోగా ఎంట్రీ ఇచ్చిన  'ఆనంద్ దేవరకొండ' కనీస స్థాయిలోనైనా మెప్పించలేకపోయాడు.  బలమైన నేపథ్యంలో  భావేద్వేగమైన ప్రేమ కథతో తెరకెక్కిన దొరసాని సినిమాలో పూర్తిగా తేలిపోయాడు.  సినిమాలో తన పాత్రలో  మంచి ఎమోషన్ని పండించే అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ..  ఆనంద్ మాత్రం మాట్లాడితే పళ్ళు మొత్తం కనబడేలా ఇకిలించడం తప్పితే..  పెద్దగా సినిమాలో నటించంది కూడా ఏమి లేదు.  బలమైన ఎమోషనల్ సన్నివేశాల్లోనైనా  మంచి బరువైన ఎక్స్ ప్రెషన్స్ పెడతాడేమోనని  మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే...  బ్లాంక్ పేస్ తో  సింగిల్ రియాక్షన్ తో సరిపట్టేశాడు. ఏ మాత్రం కష్టపడకుండానే తన అన్నయ్య సపోర్ట్ తో వచ్చిన  ఈ విలువైన అవకాశాన్ని  ఆనంద్ దేవరకొండ అస్సలు  సద్వినియోగ పరుచుకోలేకపోయాడు.  


పోనీ యాక్టింగ్ పరంగా తేలిపోతే..  డాన్స్ పరంగా వీక్ మొమెంట్స్ తో బలం లేదనిపిస్తాడు.. పోనీ,  డైలాగుల మీనింగ్ కు తగ్గట్లు ఎక్స్ ప్రెషన్స్ పలికించాడా అంటే.. ఆ విషయంలో అయితే మరీ ఘోరం.  సీరియస్ డైలాగ్ కి  సాఫ్ట్ ఎక్స్ ప్రెషన్ పెడతాడు, సాఫ్ట్ ఎక్స్ ప్రెషన్ పెట్టే చోట  సీరియస్ లుక్ ఇస్తాడు.  సరే కనీసం  ఏడుపు సన్నివేశాల్లో అన్నా  పేస్ ను ఎమోషనల్ గా పెడతాడు అనుకుంటే.. అది ఎమోషనో.. మోషనో  అర్ధం కానీ పరిస్ధితి. దీనికి తోడు శివాత్మిక రాజశేఖర్ మాత్రం దొరసానిగా  తన సహజసిద్ధమైన నటనతో అద్భుతంగా నటించింది. పైకి గంభీరంగా కనిపిస్తూ.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తోనే లవ్ ట్రాక్ ను తన నటనతో  మరో స్థాయిలో నిలబెట్టింది. దీంతో శివాత్మిక రాజశేఖర్ ముందు  ఆనంద్ దేవరకొండ పూర్తిగా తేలిపోయాడు.  చివరిగా హీరోగా ఆనంద్ దేవరకొండ  పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పాలి మొత్తంగా ఆనంద్ దేవరకొండపూర్తిగా నిరుత్సాహ పరిచాడు. అయితే ఒక్క వాయిస్ విషయంలో ఆనంద్ దేవరకొండ ఆకట్టుకున్నాడు.  కానీ, ఆ వాయిస్ విషయంలో కూడా విజయ్దేవరకొండను పక్కగా అనుకరించడంతో  ఆనంద్ దేవరకొండకి  ఆ వాయిస్ క్రెడిట్ కూడా మనస్ఫూర్తిగా ఇవ్వలేం.  ఏది అయితే ఏం మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యాడు.ప్రస్తుతం సపోర్ట్ వచ్చే అరకొర సినిమాలు తప్ప.. తన టాలెంట్ బలంతో ఇంతవరకూ ఒక్క సినిమాను కూడా తెచ్చుకోలేకపోయాడట ఈ యంగ్ హీరో పాపం.        


మరింత సమాచారం తెలుసుకోండి: