మెగా డాటర్ నిహారిక ఇప్పటివరకు మూడు సినిమాలలో నటించినా ఆమె కోరుకున్న హిట్ ఇప్పటి వరకు దక్కకపోవడంతో ఆమె ఇక సినిమాలకు గుడ్ బై చెపుతుంది అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు భిన్నంగా నిహారిక అల్లు అర్జున్ మూవీలో నటించబోతోంది అని వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. నిహారిక ఇప్పటి వరకు నటించిన  ‘ఒక మనసు' ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' ఇలా మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక ఆమె కెరియర్ అయిపోయినట్లే అని అందరు భావించారు.

దీనికితోడు ఆమె తన సొంత బ్యానర్ పై ఇక వరసపెట్టి వెబ్ సిరీస్ లు తీయడానికి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ తో చర్చలు చేస్తూ బిజీగా ఉన్న నేపధ్యంలో ఇక రానున్న రోజులలో నిర్మాతగా మాత్రమే నిహారిక సందడి చేసే ఆస్కారం ఉందని మెగా అభిమానులు భావించారు. అయితే అందరి ఊహలు తలక్రిందులు చేస్తూ ఇప్పుడు ఆమెను మళ్ళీ నటిగా యాక్టివ్ చేయడానికి స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ అల్లు అర్జున్ తో తీయబోతున్న మూవీలో ఆ మూవీ కథ రీత్యా ఒక కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర నిహారికకు సరిపోతుంది అని సుకుమార్ సూచించడంతో బన్నీకి ఆ ఆలోచన నచ్చి ప్రస్తుతం నిహారికతో రాయబారాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీలో బన్నీ పక్కన హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నా నిహారిక పాత్ర కీలకం అని అంటున్నారు. అయితే ఆమె బన్నీ పక్కన హీరోయిన్ గా కాకుండా కథను మలుపు తిప్పే పాత్ర అని అంటున్నారు. నటనకు బాగా ఆస్కారం ఉన్న ఈ పాత్ర ఆమెకు బాగా సరిపోతుందని బన్నీ కూడ భావిస్తున్నట్లు టాక్. సుకుమార్ లాంటి క్రియేటివ్ దర్శకుడు సృష్టించే పాత్ర కాబట్టి ఈ మూవీతో నిహారిక దశ తిరుగుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: