మూడు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి వారం బిగ్ బాస్ షో నుండి నటి హేమ ఎలిమినేట్ కాగా రెండవ వారం జాఫర్ ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కు ఏడుగురు ఇంటిసభ్యులు నామినేట్ అయ్యారు. 
 
రవికృష్ణ, శివజ్యోతి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, శ్రీముఖి ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. రోహిణి, శివజ్యోతి కన్ఫెషన్ రూమ్ నుండి బయటికి వచ్చాక నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించటంతో రోహిణిని బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ చేసాడు. వచ్చే వారం కూడా రోహిణి, శివజ్యోతి ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. గత వారం టాస్కులో రవికృష్ణకు గాయం కావటానికి శ్రీముఖి కారణం కావటంతో బిగ్ బాస్ గత వారం శ్రీముఖిని నామినేట్ చేసాడు. 
 
ఈ వారం ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ కు నామినేట్ కాగా అనధికారిక సర్వేల ప్రకారం వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్ ముగ్గురికీ ఎక్కువగా ఓట్లు వస్తున్నాయి. రవికృష్ణ నాలుగవ స్థానంలో ఉన్నాడు. శివ జ్యోతి, రోహిణి, రాహుల్ సిప్లిగంజ్ ముగ్గురికీ తక్కువగా ఓట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. రోహిణి, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ శ్రీముఖిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వలన కూడా రాహుల్ కు తక్కువగా ఓట్లు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. మరి అధికారికంగా ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: