బిగ్ బాస్ 3 లో నవ్వులు పండిస్తూ అందరితో స్నేహంగా, మంచితనంతో చక్కటి ఓర్పుతో తనదైన శైలీలో అందరిని అకట్టుకుంటున్న కంటెస్టెంట్ మన బుల్లితెర హీరో 'రవి కృష్ణ'.సీరియల్ నటుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న రవికృష్ణ వ్యక్తిగతం గా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం తో అందరినీ అలరిస్తాడు. బుల్లితెర ప్రభాస్ గా అమ్మాయిల గుండెల్లో ముద్ర వేసినా ఈ అందగాడు రియల్ స్టోరీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ తొమ్మిదిన బెజవాడలో పుట్టిన రవికృష్ణ ఏకైక బలహీనత తిండి. నాన్ వెజ్ అంటే విపరీతమైన ఇష్టం అది ఏ రోజైనా సరే ఏమాత్రం పట్టింపు లేకుండా తింటానని అంటాడు నవ్వేస్తూ. చిన్నతనం నుంచే నటన మీద ఎంతో ఆసక్తి ఉన్న రవికృష్ణ ఆ రంగం వైపు వెడతానంటే తండ్రి ఒప్పుకోలేదు.


అయినా మేనమామ సహకారంతో ఎలాగో డిగ్రీ అయిపోయిన తర్వాత చెన్నై వచ్చి ఒకచోట అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ తరవాత నెమ్మదిగా హైదరాబాదు వచ్చాడు ఇక్కడకు వచ్చిన తర్వాత తొలిసారి హృదయం సీరియల్ లో అతనికి అవకాశం వచ్చింది. ఆ తరవాత మరో సీరియల్ లో కొన్ని ఎపిసోడ్ లు చేసి అతని ముద్రవేశాడు. ఆ తరవాత భార్యామణులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ రంగం మీద తనకున్న ఆసక్తి అవన్నీ గమనించి నువ్వు చేసే పద్ధతి ఇలా కాదని అతనికి ఎవరూ మిత్రులు మంచి విషయాన్ని సూచించడంతో సీరియల్ డైరెక్టర్ సంజీవ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఇలా సాగుతున్న సమయంలోనే మొగలిరేకులు సీరియల్ ఆడీషన్ జరుగుతోంది. ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది వందల మంది దానికి వచ్చారు.


అంతమంది పోటీని తట్టుకొని నేను గెలవగలడా అనుకున్నాడు. అయినా సరే అతడు గెలిచి అక్కడ నిలిచి ఆ సీరియల్ కి ఎంపికయ్యాడు. ఆ సీరియల్ నుంచి అదృష్టం తలుపు తట్టింది ఏకంగా రెండేళ్ల పాటు మొగలిరేకులు తన నటనా పరిమళం గుప్పించాడు. దీంతో అతడి ఇమేజ్ మారిపోయింది ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు గా మారిపోయాడు. ఏకంగా వెండితెర ప్రభాస్ గా అతడికి ఆ పేరు వచ్చింది ఈ చాన్స్ ఎంతో పేరు తెచ్చింది. అతడి నటనకు ఆబాలగోపాలం నీరాజనాలు పలికారు. ఆ తర్వాత మనసు మమత లో వచ్చిన అవకాశం అతడి కెరీర్ ను బుల్లి తెర సూపర్ స్టార్ గా మలుపు తిప్పింది. తరువాత వరుసగా మూడు సీరియల్స్ లో అవకాశా లు వచ్చాయి. ఈలోపు బిగ్ బాస్ లో అతనికి అవకాశం తలుపు తట్టి మరోసారి అందరికీ ఆరాధ్య స్థానాన్ని అందిస్తూ రవికృష్ణ ప్రొఫైల్ ను మరింత పెంచింది. ఇలా అందరి మన్ననలు పొందుతున్నారు రవికృష్ణ. ఇక పర్సనల్ లైఫ్ లోని అంశాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి గా వుంటాయి. రవికి బేసిగ్గా మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం ఆయనకు రవి వీరాభిమాని. అలాగే ఆకుపచ్చ నీలం అతనికి ఇష్టమైన రంగులు. చిన్నప్పుడు అంటే ఏకంగా ఏడో క్లాసు లోనే ఒక అమ్మాయిని లవ్ చేశాననీ అమ్మాయి తిట్టేసింది అంటూ తన బాధ సరదాగా వర్ణించాడు. ఆ తర్వాత ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తన సర్వస్వం అని ఆయన పాటా మాటా నడక స్టైల్ అన్నీ ప్రాణం అని అంటూ ఈ రంగంలోకి రావడాని కి చిరునే స్ఫూర్తి అని తెలియజేశాడు.


అతడి మాటతీరు ప్రవర్తన అందరికీ నచ్చుతుంది అందరి కంటే స్పెషల్ గా బిగ్ బాస్ లో రవికృష్ణ గురించి తమన్నా కామెంట్స్ చేసింది. ఈ సందర్భం గా గేమ్ షోలో భాగంగానే అతడితో అలా ప్రవర్తించారని అదంతా గేమ్ లో భాగమని తమన్నా తెలిపింది. అంతేకాదు రవికృష్ణతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని అతడికి టైటిల్ రావాలని కూడా కోరుకుంటున్నట్లు తమన్నా తెలిపింది. రవిని ఇంట్లో అంతా బాబీ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇక హీరోయిన్ లలో అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ చేయాలని ఎవరో చిలిపిగా అడిగితే అంతే చిలిపిగా తడుముకోకుండా శృతి హాసన్ తో అని సందేహం లేకుండా పకపకా నవ్వుతూ చెప్పేస్తాడు. రవికృష్ణ వ్యక్తిత్వపరంగా కూడా ఎవరిని ఎక్కడ హర్ట్ చేయకుండా హాయిగా నవ్వుతూ తన జీవితాన్ని సాగిస్తున్నారు ఇక పర్సనల్ గా చూసుకుంటే బేసిగ్గా తను కాస్త భయస్తుడని ఏమాత్రం మొహమాటం లేకుండా అంటాడు. తెగింపు కోపం రవిలో తక్కువేనని చెప్పాలి మందుకొట్టడం సిగరెట్ కాల్చడం పబ్ లకు వెళ్లడం ఈ తరహా అలవాటు తనకు ఇష్టం లేదని అన్నాడు. ఒక ఇంటర్వ్యూ లో ఇటు అందచందాలతోనే కాదు అటు హావభావాలతో కూడా అందరినీ ఆకట్టుకుంటూ రవికృష్ణ బిగ్ బాస్ లో దూసుకుపోతున్నాడు బిగ్ బాస్ విన్నర్ కావాలనే అతని అభిమానులు కోరుకుంటున్నారు బొమ్మరిల్లు లాంటి బుల్లి టీవీలో జన హృదయాలను కొల్లగొట్టి భార్యామణి కోసం మొగలిరేకులు తెచ్చి మనసు మమత ఏమిటో తన నటనతో చాటిన రవి ఇంకా బ్యాచిలర్ ఇంట్లో వాళ్లు చెప్పిన అమ్మాయినే పెళ్లాడతా అంటాడు ఈ అందాల బుద్ధిమంతుడు ఇది రవి రియల్ స్టోరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: