శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న పడి పడి లేచే మనసు ఫ్లాపయ్యి నిరాశపరిచింది. అయినప్పటికి అంతకు మించి ఆశలు రణరంగం మీద పెట్టుకున్నాడు శర్వానంద్. అందుకు కారణం ఈ సినిమా కథ మీద తనకున్న నమ్మకమేనని చెప్పాలి. ఇక రణరంగం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన థియోట్రికల్ ట్రైలర్ తో ఇక అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

 'రణరంగం' కథను ముందుగా మాస్ మహారాజ రవితేజ కోసం సిద్దం చేసుకున్నట్టుగా తెలిపాడు దర్శకుడు సుధీర్ వర్మ. రవితేజకు ఈ కథను వివరించినట్టుగా అయితే ఆయనతో చేయలేకపోయినట్టుగా సుధీర్ చెప్పాడు. రవితేజకు ఆ కథ నచ్చినా సినిమా పట్టాలెక్కలేదని, దీంతో శర్వానంద్ తో చేసిన్నట్టుగా ఈ దర్శకుడు చెప్పాడు. ఇదే విషయాన్ని రవితేజకు చెప్పామని, రవితేజ కూడా ఓకే చెప్పాడని.. అలా  శర్వానంద్ తో ఈ సినిమా మొదలైందని సుధీర్ వర్మ ఈ సీక్రెట్ ను బయట పెట్టాడు. అంతేకాదు ఈ సినిమాకు ముందుగా 'దళపతి' అనే టైటిల్ ను అనుకున్నట్టుగా, అయితే అది వేరే వాళ్లు రిజిస్టర్ చేయించుకోవడంతో 'రణరంగం' అని టైటిల్ ఫిక్స్ చేసుకునట్టుగా చెప్పాడు. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఏడువందల రోజులు గడిచాయని, అయితే షూటింగ్ జరిగింది మాత్రం డెబ్బై రోజులు మాత్రమే అని చెప్పాడు. 

దీంతో పాటు మరో ట్విస్ట్ ఇచ్చాడు సుధీర్ వర్మ. అదేంటంటే హీరోయిన్ కాజల్ పాత్రకు ప్రాధాన్యత తక్కువేనట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అంత తక్కువ ప్రాధాన్యమున్న పాత్రను కాజల్ ఎందుకొప్పుకుందని..ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. ఇక  ఈ సినిమాను 'గాడ్ ఫాదర్ 2' నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నట్టుగా మరో సీక్రెట్ ను బయట పెట్టాడు. మరి ఇలాంటి సమయంలో ఇన్ని సీక్రెట్స్ లీకయితే సినిమాకు ఎఫెక్ట్ అవుతుందేమని ఫ్యాన్స్ ఫీలవుతున్నరట.   



మరింత సమాచారం తెలుసుకోండి: