నటి శ్రీరెడ్డి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు..ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఉదయం మొదలు సాయంత్రం వరకు ఈమె పేరు జపించని యూట్యూబ్ ఛానల్స్ లేవు..సోషల్ మీడియా లేదు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఉవ్వెత్తున ఉద్యమాన్ని సాగించి మద్యలోనే డ్రాప్ అయ్యింది.  వాస్తవానికి శ్రీరెడ్డి చేసిన పని మంచిదే అయినా ఒక లక్ష్యం దిశగా వెల్లకుండా ఇతరుల స్వవిషయాల్లో జోక్యం చేసుకోవడం తన ఇష్టానుసారంగా మాట్లాడటం ఆమె ఎవరినీ లెక్కచేయకపోవడం ఇలా అన్నీ తాను ఎందుకు కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని మొదలు పెట్టాను అన్న విషయం పక్కదారి పట్టింది. 

శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమానికి అప్పట్లో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల చేయూత ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.  జూనియర్ ఆర్టిస్ట్ లు సైతం ఎంతో మంది శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచారు.  టాలీవుడ్ లో ఎంతో మంది అమ్మాయిలు నటించాలని ఆకాంక్షతో వస్తే వారిని కొంత మంది దళారులు శారీరకంగా వాడుకోవడం కామన్ అయ్యిందని..చివరికి సినిమాల్లో ఛాన్స్ వస్తుందో రాదో తెలియని కొంత మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..తాను కూడా కాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యానని శ్రీరెడ్డి లేవనెత్తిన సమస్యపై అందరూ స్పందించారు. 

ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తనకు మద్దతు ఇవ్వడం లేదని ఆయనని పాయింట్ చేసింది. అంతే కాదు ఆయన తల్లిగారిపై కూడా నీచంగా మాట్లాడటంతో ఒక్కసారే సీన్ రివర్స్ అయ్యింది.  శ్రీరెడ్డి  కాస్టింగ్ క్యాచ్ ఉద్యమం పక్కదారి పట్టిందని..పార్టీల పరంగా గొడవ మొదలైంది. దాంతో శ్రీరెడ్డికి అందరూ దూరమయ్యారు..ఇక్కడ ఉండలేక చెన్నై వెళ్లిపోయింది శ్రీరెడ్డి.  అక్కడే ఉంటూ సెలబ్రెటీలపై కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాన్ పై దారుణమైన కామెంట్స్ చేసింది. 

పేకాట ఆడేవాళ్లకు మద్దతు ఇవ్వడం ఏంట్రా ? అంటూ ఆ ఎం ఎల్ ఏ ని కూడా చీవాట్లు పెట్టింది అంతేనా...పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయండి వ్యాఖ్యలు చేసింది.  అంతే తమ అభిమాన నాయకుడు, హీరో పవన్ ని పట్టుకోని అంత మాటలు అంటావా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా శ్రీ రెడ్డి మాత్రం వాళ్ళని పట్టించుకోవడం లేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: