రంగస్థలం సినిమాకి గాను అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ అవార్డును కొల్లగొడతాడని అందరూ అంచనా వేశారు. అయితే రెండో సారి కూడా రామ్ చరణ్ ను ఈ ఉత్తమ అవార్డు మొహం చాటేసింది. మొదటి సారి మగధీర గాను ఎంపికయినా రాలేదు అనుకోండి అది వేరే విషయం. అయితే రామ్ చరణ్ ప్రదర్శనకు సైమా లో కావాల్సినంత గుర్తింపు లభించింది.

ఉత్తమ కథానాయకుడిగా రంగస్థలంకు గాను రామ్ చరణ్ కు పురస్కారం లభించింది. దీంతో జాతీయ అవార్డుల లో చరణ్ కు తగిన గుర్తింపు రాలేదని బాధపడిన మెగా అభిమానులకు ఒక రకమైన ఊరట లభించింది. ఇదే చిత్రానికి గాను సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటి (క్రిటిక్స్) కు గాను సమంత, ఉత్తమ సహాయనటి కి అనసూయ, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ఛాయాగ్రహణం కేటగిరిలో రత్నవేలు, గేయ రచయితగా చంద్రబోస్, ఉత్తమ గాయనిగా మానస, ఉత్తమ కళాదర్శకుడిగా రామకృష్ణ రామకృష్ణ పురస్కారాల పంట పండించుకున్నారు.

అయితే జాతీయ అవార్డుల్లో ఉత్తమ శబ్దగ్రహణం విభాగంలో రంగస్థలం కి అవార్డు వచ్చిన విషయం విదితమే. ఇకపోతే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నా రామ్ చరణ్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాకపోవడంతో అతని బదులుగా అతని తండ్రి అయిన మెగాస్టార్ చిరంజీవి పురస్కారాన్ని అందుకున్నారు. రంగస్థలానికి 9 అవార్డులతో దక్కిన భారీ గుర్తింపుకు ప్రేక్షకులు తెగ ఆనందపడిపోతున్నారు. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం విడుదలై ఏడాది దాటినా రికార్డు మాత్రం పదిలంగా ఉంది. ఇక మెగా అభిమానులంతా చిరు కొత్త చిత్రం అయిన సైరా పైన గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తండ్రి ఖైదీతో సాధించిన రికార్డును తనయుడు రంగస్థలంతో బద్దలు కొట్టాడు. ఇక మళ్లీ సైరా తో చిరునే ఆ రికార్డు చెరిపేయాలని వారి కోరిక.


మరింత సమాచారం తెలుసుకోండి: