"నేను నాన్న".. "అలకనంద".. వైకుంఠపురములో. ఇలా బన్నీ, త్రివిక్రమ్ మూవీ గురించి చాలా టైటిల్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఎవరి ఊహకు అందని విధంగా టైటిల్ ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. ఎట్టకేలకు ఎనౌన్స్ చేసిన ఈ టైటిల్ కొందరిని అయోమయంలోకి నెట్టేస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు "అల వైకుంఠ పురములో" అనే టైటిల్ ఖరారు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. గ్లిమ్స్ పేరుతో టైటిల్ తో పాటు..వీడియోను రిలీజ్ చేశారు. బన్నీ కెరీర్ ను ఉద్దేశించేలా సెటైరికల్ గా డైలాగ్ ఉంది. 15నెలల క్రితం వచ్చిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా తర్వాత బన్నీ నటించిన సినిమా ఒక్కటీ రాలేదు. బన్నీకొచ్చిన గ్యాప్ ను డైలాగ్ గా పెట్టేశాడు త్రివిక్రమ్. 

ఇక టైటిల్ విషయానికొస్తే.. వైకుంఠపురములో అనే టైటిల్ ఊహించిందే అయినా.. దీనికి ముందు "అల"ను యాడ్ చేశారు. ఈ అల ఏమిటో రకరకాలుగా ఊహించుకుంటున్నారు ప్రేక్షకులు. అలా వైకుంఠపురంలో అన్న మీనింగ్ వచ్చినా.. "ల"కు దీర్గం లేదు. అలకనంద అన్న టైటిల్లో నుంచి అలను తీసుకున్నారని కొందరు సినీ ప్రేక్షకులు ఊహిస్తున్నారు. మొత్తానికి టైటిల్ విషయంలో త్రివిక్రమ్ మరోసారి సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. అతడు.. అఆ.. అరవింద సమేత వీరరాఘవ మాదిరి "అ"తో మొదలయ్యేలా టైటిల్ ఫిక్స్ చేశాడు దర్శకుడు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇంకేముందీ ఈయన సంగీతం అంటే చెవులు కోసుకునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అదిరిపోయే మ్యూజిక్ కు అల్లుఅర్జున్ స్టెప్స్ సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తాయనే నమ్మకం బలంగా ఉంది. బన్నీ ఒక్కసారి యాక్టింగ్ లోకి ఇన్వాల్వ్ అయ్యాడంటే ప్రేక్షకుల ముఖాల్లో నవరసాలు పండించగలడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రివిక్రమ్ పంట పండినట్టే.. ఆయన సెంటిమెంట్ వర్కవుట్ అయినట్టే..  








మరింత సమాచారం తెలుసుకోండి: