సౌత్ కి రజనీకాంత్ మానియా అలా ఇలా ఉండదు, ఆయన సినిమా అనౌన్స్ చేస్తే చాలు పూనకాలే. ఇక రిలీజ్ అయితే సునామీలే. మరి రజనీ ఇంటా బయటా అంటే బాలీవుడ్ దాటి అంతర్జాతీయంగానూ వెలిగిపోయారు. రజనీ ఫ్యాన్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటారు. అటువంటి రజనీకాంత్ కు తలదన్నే హీరో ఉంటారా అన్నది పెద్ద డౌట్. బాహుబలి వసూళ్ళు ఆ స్థాయిలో ఉన్నా ఎప్పటికైనా రజనీ హవాను దాటి వెళ్ళడం సాధ్యమేనా అనిపించేది.


కానీ ఇపుడు టాలీవుడ్ నటుడు ప్రభాస్ రజనీకే చాలెంజ్ చేస్తున్నారు. ఆయన బాహుబలి'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇపుడు లేటెస్ట్ మూవీ 'సాహో' తో సరికొత్త రికార్డుల దిశగా సాగుతున్నారు. ఈ మూవీ  ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఓ స్థాయిలో  ఉన్నాయి. ఇక ప్రభాస్ సైతం ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతనని ఆయన భావిస్తున్నారు. 


సాహో రిలీజ్ కావడానికి ముందే ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పాటు మరో రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. పారిస్ లోని ప్రతిష్ఠాత్మక థియేటర్ 'లి గ్రాండ్ రెక్స్'లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ థియేటర్ యూరప్ లోనే అతి పెద్దది. ఈ థియేటర్ లో ఒకేసారి 2800 మంది సినిమాను వీక్షించవచ్చు. 


ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన 'కబాలి', విజయ్ నటించిన 'మెర్సెల్', ప్రభాస్ నటించిన 'బాహుబలి' దక్షిణాది చిత్రాలు మాత్రమే ఈ థియేటర్ లో ప్రదర్శించబడ్డాయి.  ఇప్పుడు 'సాహో' కూడా ఆ థియేటర్ లో ప్రదర్శించనుండటంతో... ఆ థియేటర్ లో రెండు సినిమాలను విడుదల చేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్టు పుటల్లోకి ఎక్కబోతున్నాడు. మొతానికి ప్రభాస్ రజనీ రికార్డులు చెరిపేసే హీరోగా మళ్ళీ సౌత్ నుంచి ఎదగడం నిజంగా గ్రేట్. అందులో టాలీవుడ్ నుంచి  ప్రభాస్ లాంటి హీరో రావడం అంటే తెలుగువారికి కూడా గర్వకారణమే.



మరింత సమాచారం తెలుసుకోండి: