శంకర్ దర్శకత్వం వహిస్తున్న కమల్ హాసన్ ఇండియన్ 2లో రకుల్ ప్రీత్ సింగ్ చేరిపోయింది. షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఎప్పటిలాగే దర్శకుడు శంకర్ అప్ డేట్స్ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. 23 ఏళ్ళ క్రితం చరిత్ర సృష్టించిన భారతీయుడు సీక్వెల్ కావడంతో అటు తమిళంలోను ఇటు తెలుగులోను అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు రకుల్ ఎంట్రీనే కమల్ తోపాటు కమల్ ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోందట. ఎందుకంటే గత కొంతకాలంగా రకుల్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అవడమే.

ఇక తెలుగులో రీసెంట్‌గా వచ్చిన మన్మథుడు 2 గురించైతే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 60 శాతం దాకా బయ్యర్లు నష్టపోయారట. ఇక సూర్య ఎన్జికె దీనికి ఏ మాత్రం తీసిపోని ఫలితాన్నిచ్చింది. ఇక కార్తీ దేవ్ గురించి ఎన్టీఆర్ కథానాయకుడులో వేసిన క్యామియో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీటి ముందు చేసిన తెలుగు సినిమాలు స్పైడర్, జయ జానకి నాయక గురించి చెప్పనవసరం లేదు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ హిందీ మూవీ దే దే ప్యార్ దే జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది కానీ అదీ చెప్పుకునేంత గొప్ప సక్సెసూ కాదు. ఈ లెక్కన రకుల్ కు కెరీర్ మొదట్లో వచ్చిన బ్యాడ్ పీరియడ్ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఇప్పుడీ ఇండియన్ 2 తనకు బ్రేక్ ఇస్తుందా లేక నెగటివ్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తుందా అనేదే కమల్ అభిమానులను టెన్షన్ పెడుతున్న విషయం. ఇక ఇందులో రకుల్ సిద్ధార్థ తో కలిసి నటిస్తుందని సమాచారం. వచ్చే సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేసిన ఇండియన్ 2 ఆఫర్ పట్ల రకుల్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. దీని కోసమే బల్క్ డేట్స్ కూడా ఇచ్చిందట. ఇదంతా ఓకే కానీ  గత కొంత కాలంగా  వెంటాడుతున్న పరాజయాల  నీడ ఇండియన్ 2తో నైనా వదులుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: