రైట‌ర్‌గా మంచి  మంచి క‌థ‌లు రాస్తూ హీరోగా న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు అడ‌విశ‌ష్‌. విభిన్న కథా చిత్రాలతో నటుడిగానే కాదు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు శేష్. ప్రస్తుతం  హీరో అడివి శేష్, రెజీనా క‌సండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలో న‌టించిన చిత్రం ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌ పై  వెంకట్ రాంజీ ని దర్శకుడిగా పరిచయం  ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగష్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది. 
  
  మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్ కి వెళితే అక్కడ రామ్ చరణ్ గారు నన్ను చూసి కంగ్రాట్స్ చెప్పారు. లేదండి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అని అన్నానుకానీ... నేను ట్రైలర్ చూశాను తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అన్నారు. చాలా సంతోషం వేసింది. దీనంతటికి కారణం మా దర్శకుడు వెంకట్ రాంజీ. ఫస్ట్ మూవీ అయినా ఎంతో ప్యాషన్ తో తెరకెక్కించారు.  అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది.


నేను విక్రమ్ వాసుదేవ్ అనే  పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. చాలా కేర్ లెస్ గా ఉండే ఒక పోలీస్ ఆఫిసర్ కి  వీడి ప్రపంచాన్ని మించిన ఒక మిస్టరీ కేసు సాల్వ్ చేయాల్సి వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ‘క్షణం అందర్నీ ఆక్కట్టుకున్న థ్రిల్లర్ సినిమా ఆ తర్వాత నేను చేసిన ‘అమీ తుమీ’ ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం. ‘గూఢచారి’లో కొన్ని థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఉన్నప్పటికీ అదొక యాక్షన్ డ్రామా. థ్రిల్లర్ కాదు. కాబట్టి  క్షణం తర్వాత నేను చేసిన కంప్లీట్ ప్రాపర్ థ్రిల్లర్ సినిమా  ఎవరు. ప్రతి థ్రిల్లర్ లో ఏంటంటే ట్విస్ట్ తెలియగానే రిలాక్స్ అయిపోతాం. మళ్ళీ సినిమా చూడాలనిపించదు. నా ఫార్ములా  ఏంటి అంటే ప్రతి ట్విస్ట్ వెనకాల ఒక ఎమోషన్ ఉండాలి అప్పుడు ట్విస్ట్ కోసం కాకపోయినా ఎమోషన్ కోసం అయినా ఆడియన్స్ రిపీటడ్ గా సినిమా చూస్తారు. ఇక‌పోతే ట్రైల‌ర్‌లో చూసే రెజీనా సీన్స్ గురించి అంద‌రూ సినిమాలో మ‌సాలా ఎక్కువుంద‌ని అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. కేవ‌లం ఒక్క సీన్ కోసం అలా పెట్టారు అంతే.  ఆ సీన్ కూడా రేప్ జరిగింద‌ని చెప్ప‌డం కోసం మాత్ర‌మే అది మ‌సాలా సీన్ కాదు. అలాగే నేను దెయ్యం సినిమాలు ఎక్కువ‌గా చూడ‌ను. నాకు దెయ్యాలంటే చాలా భ‌యం. చూడ‌ను అలాంటి సినిమాలు తియ్య‌ను కూడా అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: