బాలయ్య ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. కాగా ఇటివలే ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సోనాల్ చౌహాన్ ఈ రోజు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొందట. ఒక పాట సీక్వెన్స్ కోసం సోనాల్ ఈ సినిమాలో బికినీ వేసి ఆడిపాడనుందని సమాచారం. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి 'లెజెండ్, డిక్టేటర్' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'డిక్టేటర్' తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాలో బాలయ్య - సోనాల్ చౌహాన్ ట్రాక్ ఎమోషనల్ గా సాగనుందని సమాచారం. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.
సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అభిమానులు మాత్రం ఈ టైటిల్ను బాగా ఓన్ చేసుకున్నారు. ఎప్పటికైనా ఆ టైటిల్ తో బాలయ్య సినిమా చేస్తే బాగుండని ఆశపడ్డారు. మరి వారి కోరిక ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ఈ సినిమాను మూడు నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. గతంలో ఈయన బాలయ్యతో కలిసి 'జైసింహ' అనే చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నమితను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.
అయితే ఆ మధ్య ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో బాలయ్య కొని మార్పులు చెప్పారని.. బాలయ్య సూచన మేరకు కె.ఎస్.రవికుమార్ కథలో మార్పులు చేసాడని.. కానీ ఆ మార్పులు బాలయ్యకి నచ్చలేదని రూమర్స్ వచ్చాయి. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదట.