తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో  యాక్షన్ హీరో  గోపీచంద్ హీరోగా  వస్తోన్న యాక్ష‌న్  స్పై   థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. అయితే ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కాగా ఇటివలే  ప్రారంభమైన  డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు.   ఇక ఈ సినిమాను సెప్టెంబర్‌ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే మిగిలిన సాంగ్స్ ను మూవీ మేకర్స్  విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు.  కాగా ఈ చిత్రంలో  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట.  ముఖ్యంగా ఇండో - పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.  ఏమైనా  ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెరుగుతున్నా  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వచ్చేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.  ముఖ్యంగా ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో   చేసిన సీన్స్  చాల బాగా వచ్చాయట. అలాగే   సినిమాలో  హై బడ్జెట్ తో కుడనుకున్న  యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయట.  


ఇక ఈ సినిమాలో  గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక  మిగిలిన మూడు సాంగ్స్ ను  వచ్చే వారంలో జరిగే షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు.   కాగా  గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర  నిర్మిస్తున్నారు. మరి గత కొన్ని సినిమాలుగా  వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న  గోపీచంద్ కి సరైనా హిట్ వచ్చి చాల కాలమే అయిపొయింది.ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి  హిట్ కొట్టాలని బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. పైగా ఈ సినిమా కోసం గోపీచంద్ మరో రెండు సినిమాలను వదులుకున్నాడు కూడా. వాటిల్లో సంపత్ నంది మూవీ కూడా ఉంది.     


మరింత సమాచారం తెలుసుకోండి: