టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఆయన కెరీర్ 25వ సినిమాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి సినిమా, అతి పెద్ద విజయాన్ని అందుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. భారీ వ్యయంతో అశ్వినిదత్, పివిపి, దిల్ రాజు కలిసి సంయుక్తంగా తమ నిర్మాణ సంస్థలపై నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం జరిగింది. సూపర్ స్టార్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కామెడీ సినిమాల నటుడు అల్లరి నరేష్ ఒక ముఖ్యపాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు. 

స్నేహం యొక్క గొప్పతనాన్ని చాటిచెపుతూ, మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క ఆవశ్యకతను, అలానే రైతులకు సంబంధించి ఒక మంచి మెసేజిని అందించిన ఈ సినిమాకు, మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, మెల్లగా సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయి, అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇకపోతే ఈ సినిమా నుండి డిలీట్ చేసిన ఒక సీన్ ని, నిన్న యూనిట్ సభ్యులు యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. సినిమాలోని కాలేజీ ఎపిసోడ్ సమయంలో వచ్చే ఈ సీన్లో, కమల్ కామరాజు, హీరోయిన్ పూజతో స్నేహంగా ఉంటున్న మహేష్ బాబును అడ్డగించడం, ఆపై వారిద్దరి మధ్య వాగ్విదాం జరిగి, అది పెద్ద గొడవగా పరిణమించి కొట్టుకోవడం, అనంతరం ఆ గొడవ కాలేజీ ప్రిన్సిపాల్ వరకు చేరడం వంటి అంశాలు ఈ డిలీటెడ్ సీన్లో చూడవచ్చు. 

అయితే అప్పటికే రిలీజ్ అయిన మహర్షి సినిమాకు నిడివి ఎక్కువ అవడంతో ఈ సీన్ ని, సినిమాలో జత చేయలేకపోయామని యూనిట్ అంటోంది. ఇక నిన్నటి నుండి విపరీతమైన వీక్షకధారణతో ఈ సీన్, దాదాపుగా 1.4 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సీన్ లో మహేష్ బాబు డైలాగ్స్, స్టైల్ చూసి ఎంతో మురిసిపోతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, దానిని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విపరీతంగా షేర్స్ మరియు లైక్స్ తో వైరల్ చేస్తున్నారు.....!


మరింత సమాచారం తెలుసుకోండి: