టాలీవుడ్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాకు కమర్షియల్ క్రేజ్ తెచ్చిన మెగాస్టార్.. టికెట్లు రేట్లు చాలా తక్కువ ఉన్న టైంలో కూడా రికార్డులు కొల్లగొట్టాడు. తను చేసే ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించే మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ గా 150 సినిమాలు పూర్తి చేసుకున్నాడు.   


ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. 64వ వసంతంలోకి అడుగుపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి ఈ బర్త్ డేకు సైరా ట్రీట్ ఇవ్వనున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2 గాంధి జయంతినాడు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  


అంతేకాదు చిరు బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ అంతా ఓ కామన్ డీపీ (డిస్ ప్లే) ని మెయింటైన్ చేసేలా మెగా ఫ్యాన్స్ ఓ స్పెషల్ పోస్టర్ డిజైన్ చేయించారు. కేవలం డీపీగానే కాదు (హెల్ప్ ఫ్లడ్ విక్టిమ్స్) తుఫాను బాధితులను సహాయార్ధంగా విరాళాలు సేకరిస్తున్నారు. మెగాస్టార్ దారిలోనే సేవా కార్యక్రమాల్లో మెగా ఫ్యాన్స్ కూడా చురుకుగా పాల్గొంటారు.     


ఈ ఇయర్ చిరు బర్త్ డే సందర్భంగా తుఫాను బాధితులకు సహాయం అందించేందుకు డొనేషన్స్ కలెక్ట్ చేసి అవి బాధితులకు అందచేయనున్నారు. కామన్ డీపితో పాటుగా ఈ సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని చూస్తున్నారు. అభిమానులు అంటే తమ అభిమాన నటుడి పరువు నిలబెట్టేలా ఉండాలి కాని అతన్ని కూడా కిందకు దిగజార్చేలా ఉండకూడదని మెగా ఫ్యాన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ కోసం చేస్తున్న ఈ మహా కార్యాన్ని విజయవంతం చేయాలని తెలుగు రెండు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ ను కోరుతున్నారు.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: