నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కాగా సీజన్2 పరవాలేదనిపించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 కు నాగార్జున హోస్ట్ కావటంతో షోపై అంచనాలు పెరిగాయి. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలు కూడా సినిమాలు, సీరియల్స్, యుట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారే కావటంతో ప్రేక్షకులు ఈ షోపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. 
 
బిగ్ బాస్ సీజన్ 3 లాంఛింగ్ ఎపిసోడ్ 17.90 రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ అందుకొంది. బిగ్ బాస్ మూడవ వారంలో అర్బన్ టీఆర్పీ రేటింగ్ 11.1 కాగా అర్బన్ రూరల్ రెండూ కలిపి 7.3 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. వీక్ డేస్ లో బిగ్ బాస్ రేటింగ్స్ యావరేజ్ గా 5.4 ఉన్నట్లు తెలుస్తుంది. లాంఛింగ్ ఎపిసోడ్ తో పోలిస్తే టీఆర్పీ రేటింగ్స్ తగ్గినప్పటికీ ప్రస్తుతం బిగ్ బాస్ షోకు వస్తున్న రేటింగ్స్ అంత తక్కువేమీ కాదు. 
 
వీకెండ్ షోలలో నాగార్జున తన హోస్టింగ్ తో ఆకట్టుకుంటోంటే వీక్ డేస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య జరుగుతున్న వివాదాలు షోను రక్తి కట్టిస్తున్నాయి. బిగ్ బాస్ షోలోకి 15 మంది సెలబ్రిటీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి రాగా ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కు ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. 
 
గత వారం నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించటంతో శివ జ్యోతి నేరుగా నామినేట్ కాగా కెప్టెన్ అలీ బాబా భాస్కర్ ను నామినేట్ చేసాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు రాహుల్ సిప్లిగంజ్, హిమజ, పునర్నవి భూపాళం, మహేశ్ విట్టా, అషు రెడ్డిని నామినేట్ చేసారు. అనధికారిక ఓటింగ్ ప్రకారం ఈ వారం పునర్నవి, అషు రెడ్డి,మహేశ్ విట్టాలలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: