త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. ఆ రెండు అనుకున్నుంత కమర్షియల్ సక్సస్ కాదనే చెప్పాలి. అయినా కూడా ఈ కాంబినేషన్ మీద విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే అల వైకుంఠపురములో.. ఇంట్రడ్యూసింగ్ టీజర్ రీసెంట్‌గా వచ్చింది. ఇన్నాళ్లు సినిమా చేయకుండా వుండిపోయినందుకు క్లారిటీ ఇస్తున్నట్లుగా ఆ టీజర్ లో డైలాగ్ కట్ చేసారు. గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంటూ..బన్ని చెప్పిన డైలాగ్ అంతగా ఎక్కలేదు. గ్యాప్ తీసుకుంటేనేం.. వస్తేనేం.. ఏదైనా ఒకటే. అల్లు అర్జున్ సినిమా ఒక్కటీ కూడా ఈ ఏడాది లేదు అన్నదే ఈ డైలాగ్ మీనింగ్. 

సరే ఆ సంగతి అలావుంచితే, టీజర్ లో బన్నీ లుక్స్ మీద అప్పుడే గుసగుసలు సార్ట్ అయ్యాయి. ఇదివరకు వుండే హుషారు కళ్లలో, ఫేస్ లో లేదని, ఎంత పాత్ర పరంగా డైలాగు చెప్పించినా, ఫేస్ లో ఏదో తెలియని డల్ నెస్ కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ లో బాగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు బన్ని హెయిర్ స్టయిల్ మీద కూడా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో వరుడు లాంటి అట్టర్ ఫ్లాపు సినిమాలో కూడా ఇదే హెయిర్ స్టయిల్ వుందని క్రిటిసిజిమ్ వస్తోంది. అసలే త్రివిక్రమ్-బన్నీ సినిమా షూటింగ్ నత్త నడకగా సాగుతోంది. దీనికి పోటీగా వస్తున్న మహేష్ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. సూపర్ ఫన్ తో మహేష్ సరిలేరు వస్తోంది అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కానీ బన్నీ సినిమా మాత్రం ఇప్పటి వరకు ఫైట్లు తీయడంతోనే సరిపోతోంది. అసలు స్టోరీ చిత్రీకరణలోకి ఇప్పటిదాకా ఎంటరవలేదని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న టబు ఇంటి సెట్ లోనే అసలు కథ చిత్రీకరణ వుంటుందని లేటెస్ట్ న్యూస్. ఇప్పటిదాకా ఎక్కడ చేసినా, బిల్డప్ షాట్లు, ఫైట్ షాట్ లే తీసారని తాజా సమాచారం.
2020 సంక్రాంతి విడుదల కాబట్టి టైమ్ చాలానేవుంది. కాబట్టి టైమ్ సమస్యలేదు. అయితే త్రివిక్రమ్ సెంకడాఫ్ స్క్రిప్ట్ ను ఏం చేసారన్న దాన్ని బట్టే అసలు సినిమా మీద అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరి ఈసారైనా త్రివిక్రమ్.. బన్ని కి బ్లాక్ బస్టర్ ఇస్తాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: