ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. ఇక కేరళా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లో గ్యాప్ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేరళా జలదిగ్భందంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్ లో కూడా దారుణంగా తయారైంది. భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడుతుండడం, రోడ్లు కొట్టుకుపోతుండడంతో జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు.  అయితే భారీ వర్షాలకు సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా నానా కష్టాలు పడుతున్నారు.

తాజాగా మలయాళ నటి మంజు వారియర్ తో పాటు చిత్రబృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నారు.  దాదాపు ముప్పై మంది ఉన్న ఈ బృందం చట్రూ అనే కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు.  మాలీవుడ్ లో మంజు వారియర్ మంచి నటిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ఇటీవల మాలీవుడ్ సూప్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఒడియాన్ మూవీలో నటించింది. కాగా, సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం వీరంతా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అయితే భారీ వరదన కారణంగా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు కొట్టుకుపోవడంతో మంజుతో పాటు ఇతర సభ్యులు అక్కడే చిక్కుకుపోయారు.  ఈ విషయాన్ని మంజు వారియర్ శాటిలైట్ ఫోన్ ద్వారా తన సోదరుడు మధుకి తెలిపింది.  వెంటనే ఆమె సోదరుడు కేరళా ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లాడు.

వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అక్కడి అధికారులకు విషయాన్ని వెల్లడించడంతో ఆయన ఆదేశాల ప్రకారం మంజు వారియర్, చిత్రబృందాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. తాము వరదల్లో చిక్కుకున్న సమయంలో అక్కడ టెలిఫోన్, సెల్ ఫోన్ లైన్స్ ఏం  పని చేయడం లేదని అయితే సోమవారం రాత్రి తన సోదరి మంజు వారియర్ ఫోన్ చేసి క్షేమంగా ఉన్నామని చెప్పినట్లు మధు వెల్లడించాడు.

మరోవైను చిత్ర యూనిట్ తీసుకు వెళ్లిన తిండి పదార్థాలు ఒక్కరోజుకే సరిపోయానని..వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని సాయం అందేలా చూడమని కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని మధు కేరళ జూనియర్ విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మంత్రి వరదల్లో చిక్కుకున్న చిత్ర బృందాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: