బిగ్‌బాస్, సంచ‌ల‌నాల‌కు మారుపేరుగా నిలిచిన రియాల్టీ షో. ప్ర‌స్తుతం ఈ పేరు చెబితే చాలు బిగ్‌బాస్ హౌస్‌లోని ఇంటి స‌భ్యుల‌తోపాటు వ్యాఖ్యాత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అదేంటి ముంద‌స్తు కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కార‌మే క‌దా షో ప్రారంభ‌మ‌య్యేది..! అటువంట‌ప్పుడు ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రమేముంటుంది..? అవును నిజ‌మే.


ఒప్పందం మేర‌కు బిగ్‌బాస్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, ఒక్కొక్క ఇంటి స‌భ్యుడు విభిన్న మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటాడుగా..! వారి ఇగో హ‌ర్ట్ అయితే..? ఆ ఆవేశ‌మే ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పితే..?అవును, మీరు చదివింది అక్ష‌రాల నిజం. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పాటిస్పెంట్ ఏకంగా ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. దీంతో ఇంటిలోని ఇత‌ర పాటిస్పెంట్స్‌తోపాటు వ్యాఖ్యాత కూడా ఖంగుతిన్నాడు. సున్నిత మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఆ పాటిస్పెంట్ అస‌లుకే ఎస‌రు తెచ్చేట్టు ఉందే అని భావించిన బిగ్‌బాస్ యాజ‌మాన్యం ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. ఇంత‌కీ ఈ సంఘ‌ట‌న ఏ బిగ్‌బాస్ హౌస్‌లో చోటు చేసుకుంద‌నేగా మీ ప్ర‌శ్న‌.. అదేనండీ మ‌న యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌మిళ బిగ్‌బాస్ హౌస్‌లో.ప్ర‌తి ఏడాది బిగ్‌బాస్ ఏ భాష‌లో ప్రారంభ‌మైనా స‌రే ఆ షో ముగిసే వ‌ర‌కు వివాదాలు కొన‌సాగుతూనే ఉంటాయి.


ఆ కోవ‌లోనే త‌మిళ బిగ్ బాస్‌కూడా వివాదాల‌కే కేంద్ర బిందుగా మారింది. ఈ క్ర‌మంలోనే పాటిస్పెంట్, హాస్య‌న‌టి మ‌ధుమిత ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం ఇంటి స‌భ్యుల‌తోపాటు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌మ‌ల్ హాస‌న్‌ను సైతం ఒకింత క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. మ‌ధుమిత బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 50 రోజుల‌కుపైగా పూర్తి చేసుకుంది. హౌస్ కెప్టెన్‌గా కూడా మ‌ధుమిత‌ను బిగ్‌బాస్ ఎంపిక చేశాడు. అయితే అనూహ్య రీతిలో మ‌ధుమిత ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించ‌డంతో బిగ్‌బాస్ ఆమెను బ‌య‌ట‌కు పంపించేశాడు.


బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌ధుమిత‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధులు ఆమెను ప్ర‌శ్నించ‌గా, బిగ్‌బాస్ హౌస్ త‌న‌కు ఎన్నో మ‌రిచిపోలేని జ్ఞాప‌కాల‌ను మిగిల్చింద‌ని చెప్పింది. అయితే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌న‌కు ఇంటి స‌భ్యులు ఎవ్వ‌రు కూడా స‌హ‌క‌రించ‌లేద‌ని చెప్పిన మ‌ధుమిత ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేశార‌ని బిగ్‌బాస్‌ ఇంటి స‌భ్యుల‌పై విరుచుకుప‌డింది. వారు చేసిన అవ‌మానాల‌ను త‌ట్టుకోలేక‌నే తాను ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన‌ట్టు మ‌ధుమిత మీడియాతో చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: