ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో, ఇప్పటికే ట్రైలర్ మరియు వీడియో ప్రోమో సాంగ్స్ విడుదల తరువాత ఆకాశమే హద్దుగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. తెలుగు సహా పలు ఇతర భాషల్లో ఈనెల 30వ తేదీన అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ మెల్లగా ప్రేక్షకులకు చేరువ చేస్తూ, తమ సినిమాపై రోజురోజుకు మరింత హైప్ ని పెంచుతోన్న సాహో యూనిట్, 

మొన్న హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్, బాలీవుడ్ జాక్వలీన్ ఫెర్నాండేజ్ ల జోడి కలయికలో చిత్రీకరించిన బ్యాడ్ బాయ్ అనే పల్లవితో సాగె సాంగ్ వీడియో ని రిలీజ్ చేసింది. ప్రభాస్ అల్ట్రా మోడరన్ లుక్ లో అదరగొట్టిన ఈ సాంగ్ లో ఆయనతో కలిసి ఆడిపాడి యూత్ కి కిక్ ఎక్కించింది జాక్వలీన్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ నటిస్తుండగా, కేవలం ఒకే ఒక్క ప్రత్యేక గీతంలో మెరిసిన జాక్వలీన్, ఆ ఒక్క సాంగ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇక నిన్న యూట్యూబ్ లో రిలీజ్ ఆయన ఈ సాంగ్, ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన సాంగ్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 2009లో బాలీవుడ్ లో వచ్చిన అలాద్దీన్ అనే సినిమా ద్వారా సినీ రంగప్రవేశం చేసింది జాక్వలీన్. 

అయితే కెరీర్ పరంగా 21 సినిమాల్లో నటించిన జాక్వలీన్, చాలావరకు నటించిన సినిమాల్లో అక్కడక్కడ చిన్న పాత్రల్లోనే నటించింది. అయితే ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో కలిసి సాహోలో చేసిన ఈ ఒకే ఒక్క సాంగ్ తో బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక అనుకున్న విధంగా రేపు సాహో రిలీజ్ తరువాత మంచి హిట్ సాధిస్తే, జాక్వలీన్ కు అది కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని ఇస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: