డి ఇమాన్ అందించిన BGM,క్లైమాక్స్ డి ఇమాన్ అందించిన BGM,క్లైమాక్స్ వీక్ స్క్రీన్ ప్లే,సన్నని కథ,పాటల టైమింగ్,ఇంకా చాలా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండే ఒక సాదాసీదా యువకుడు శివ (విశాల్) , తండ్రి సుందరం (భారతి రాజ) , ఒక నిజాయితి గల రిటైర్డ్ ఆఫీసర్ . వృత్తి రిత్యా శివ అన్నయకి మరియు కటం రవి అనే రౌడీకి మధ్య గొడవ ఏర్పడుతుంది. ఇదిలా ఉంటె శివ కి మాలతికి మధ్య ప్రేమ కథ మరో పక్క నడుస్తుంటుంది. ఈ గొడవలో రవి శివ అన్నయ్యని చంపేస్తాడు. దానికి ప్రతీకారంగా శివ రవి ని చంపేయాలనుకుంటాడు అదే సమయంలో సుందరం కూడా రవిని చంపించాలని ప్రయత్నిస్తాడు అసలు వారిద్దరి ప్రణాళికలు ఫలించాయా? లేదా? అనేది మిగిలిన కథ... విశాల్ నటన గురించి చెప్పుకోవాలంటే గతంలో పందెం కోడి ,పొగరు వంటి చిత్రాలలో లానే ఈ చిత్రంలోనూ నటించాడు. ఈ పాత్రకి మరింత హోం వర్క్ చేసి ఇంకాస్త రియలిస్టిక్ గా చేసి ఉంటె మరింత బాగుండేది . ఈ విభాగంలో తరువాత చెప్పుకోవలసిన నటుడు భారతీరాజ ఈ పాత్రకి ప్రాణం పోసాడు అని చెప్పుకోవాలి అయన ఉన్న అన్ని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. లక్ష్మి మీనన్ కొన్ని సన్నివేశాలలో బాగానే ఉన్నా "హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఉండాలి" అన్న ఫార్ములా ఫాలో అయ్యి పెట్టిన పాత్ర కాబట్టి నటించే అవకాశం ఎక్కువగా రాలేదు లక్ష్మి మీనన్ కూడా అలానే నటించింది. విలన్ పాత్రలో నటించిన నటుడు చాలా బాగా నటించాడు మిగిలిన వారందరు పరవాలేదనిపించారు. ప్రత్యేక పాత్రలో నటించిన విక్రాంత్ చాలా బాగా నటించాడు. దర్శకుడు సుసీంద్రన్ గతంలో లానే ఈ చిత్రంలో కూడా సన్నని లైన్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలను రచించుకున్నాడు. ఇంకా విభాగాల వారిగా చెప్పుకోవాలంటే దర్శకుడిగా సుశీంద్రన్ జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్నారు. కథనం విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే అయన గతంలో చేసిన చిత్రాలలో చాలా పగడ్భంది కథనం ఉంది ఈ చిత్రంలో అదే మిస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అని చెప్పలేము కాని బాగుంది. సంగీతం విషయంలో డి ఇమాన్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాడు పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కాని అయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది కొన్ని సన్నివేశాలకు అయన అందించిన నేపధ్య సంగీతం అద్భుతం అని చెప్పుకోవాలి. ఈ చిత్రంలో పాటల టైమింగ్ అసలు బాగోలేదు. రెండవ అర్ధ భాగంలో చాలా అనవసర సన్నివేశాలు ఉన్నాయి ఎడిటర్ కాస్త గమనించి కత్తిరించి ఉండాల్సింది. నిర్మాణ విలువగా బాగా మైంటైన్ చేశారు. పలు ఫ్లాప్ లతో విజయం కోసం పోరాడుతున్న విశాల్ దర్శకుడు విషయంలో జాగ్రత్త తీసుకున్నట్టు గానే కథలో కూడా కాస్త జాగ్రత్త వహించాల్సింది. "నా పేరు శివ" చిత్రంలో మొదటి నుండి చివరి వరకు చాలా సన్నని కథ అయినా ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న పటుత్వం ఆ చిత్రానికి ప్రధాన హైలెట్ ఈ చిత్రంలో అదే మిస్ అయ్యింది. క్లైమాక్స్ రాసేసుకొని దాన్ని చేరుకోడానికి రాసుకున్న సన్నివేశాల లా ఉంటాయి ఈ సినిమాలో సన్నివేశాలు. సుసీంద్రన్ అన్ని సినిమాలలో లానే ఈ సినిమాలో కూడా క్లామక్స్ మాత్రమే హైలెట్ గా ఉంటుంది. ఇలా అయన క్లైమాక్స్ కోసం చిత్రాలు చెయ్యడం మానేస్తే బాగుంటుంది. ఈ చిత్రం ఒక డిఫరెంట్ చిత్రంగా ఉంటుంది కాని బాగా స్లో నేరేషన్ వల్ల ఏ సెంటర్ లో ఆడటం కష్టమే ,పండగకి ఏదయినా సినిమా చూడాలని అనుకుంటే మిగిలిన చిత్రాలతో పోలిస్తే ఇది బెటర్ ఆప్షన్.. Vishal Krishna,Lakshmi Menon,Susindhran,D. Imman,Vikranth,Bharathiraja పల్నాడు - పెద్దగ ఆకట్టుకొని చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: