టాలీవుడ్ లో వందలాది సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  ఆలా రిలీజైన సినిమాల్లో కొన్ని సినిమా హిట్ అవుతుంటాయి.  కొన్ని ఫెయిల్ అవుతుంటాయి.  హిట్టైన సీనియాలు చాలా వరకు టాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి.  అయితే, ఇప్పుడు టాలీవుడ్లో హిట్టైన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.  అంతేకాదు, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఒకేసారి సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  ఇలా సినిమాను ఒకేసారి రిలీజ్ చేయడం మంచి లాభాలు వస్తున్నాయి.  


అందుకు ఓ ఉదాహరణ బాహుబలి.  బాహుబలి సినిమా బాలీవుడ్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఫస్ట్ పార్ట్ ఎలా హిట్టయ్యిందో సెకండ్ పార్ట్ కూడా అదే విధంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  రెండు సినిమాలు అక్కడ భారీ హిట్ కొట్టాయి.  దీంతో సౌత్ సినిమాలు బాలీవుడ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.  అయితే, ఇప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి బడా సంస్థలు ముందుకు వస్తున్నాయి.  ముఖ్యంగా టిసిరీస్, ఎక్సల్ ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలు సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి.  


అయితే, ఇదే విధంగా బాలీవుడ్ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానికి పెద్ద సంస్థలు ముందుకు వస్తున్నాయి.  ఇందులో భాగంగా బాలీవుడలో తెరకెక్కుతున్న సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమా తెలుగు రిలీజ్ ను సురేష్ ప్రొడక్షన్ సంస్థ తీసుకుంది.  తెలుగు హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ తీసుకున్నది కాబట్టి తప్పకుండా డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  దబాంగ్, దబాంగ్ 2 లో తెలుగులో రీమేక్ అయ్యాయి.  


కానీ, దబాంగ్ 3 సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారట.  సో, సల్మాన్ ఖాన్ మార్కెట్ మార్కెట్ ను పెంచుకోవడాని ఇదొక మార్గం అవుతుంది.  సల్మాన్ కు సౌత్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.  కాకపోతే ఇక్కడ అయన సినిమాలు చాలా తక్కువగా డబ్ అవుతుంటాయి.  సౌత్ సినిమాలు నార్త్ కు ఎలా వెళ్తున్నాయో.. నార్త్ సినిమాలు కూడా సౌత్ కు అలా వస్తున్నాయన్న మాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: