టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'అల వైకుంఠపురం' లో అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. చాలా టైం తీసుకునే ‘నా పేరు సూర్య’ తర్వాత త్రివిక్రమ్ సినిమాకి ఓకే చెప్పిన అల్లు అర్జున్ కచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో అలాగే గతంలో త్రివిక్రమ్ తనకు రెండు బ్లాక్ బస్టర్ లు ఇవ్వటంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ పై ఎక్కడానికి రెడీ అయ్యాడు. సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త ఇటీవల బయటకు వస్తూ అభిమానులను సినిమాపై అంచనాలు పెంచుతోంది.


అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్టైలిష్ మూమెంట్స్ తో అల్లుఅర్జున్ వేసే డాన్స్ వెండితెరపై ప్రేక్షకులను ఆస్వాదించే తట్టు చేస్తుంది. ముఖ్యంగా తన సినిమాలో ఐటెం సాంగ్ లో అల్లుఅర్జున్ వేసే స్టెప్పులు సినిమాకే చాలాసార్లు హైలెట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే 'అల వైకుంఠపురంలో' అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో త్రివిక్రమ్ కాజల్ అగర్వాల్ ని చేసుకున్నట్లు సమాచారం.


గతంలో అల్లు అర్జున్ పక్కన కాజల్ అగర్వాల్ ఆర్య ఎవడు అనే సినిమాలో నటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గత కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించలేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఐటెమ్ సాంగ్ ద్వారా అమ్మడు మాటల మాంత్రికుడు సినిమాలో కనిపించడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం సినిమా కోసం వేసిన 5కోట్ల ఖరీదైన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: