వాల్మీకి చిత్రంలో వరుణ్ మునుపెన్నడూ చేయని ఉరమాస్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. నల్లని బట్టలు, పెరిగిన జులపాలతో భయంకరంగా ఉన్న వరుణ్ లుక్ కి ఇప్పటికే విశేష స్పందన లభించింది. మరి హీరో అంత ఊర మాస్ పాత్ర చేస్తున్నప్పుడు ఒక డబుల్ ఊర మాస్ ఐటెం సాంగ్ అనేది సర్వసాధారణం. తాజాగా అలాంటి ఊర మాస్ సాంగ్ నే విడుదల చేసారు చిత్ర బృందం. 


జర్రా జర్రా అంటూ సాగే ఈ పాటలో వరుణ్, అధర్వ ఆకట్టుకున్నారు. ఈఐటెం సాంగ్ లో డింపుల్ హయ్యత్ వరుణ్ సరసన ఆడి పాడింది. పాట మాస్‌ బీట్‌ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. మిక్కీ జె మేయర్ సంగీతం, అనురాగ్ కులకర్ణి వాయిస్ తో ఈ పాట ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది.                 


అయితే పెద్దనాన్న పుట్టినరోజు సందర్బంగా ఈ పాటను విడుదల చెయ్యడంతో ఆనందంలో ఉన్న మెగా ఫ్యాన్స్ మరి రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ పాటతో ఆ అంచనాలను ఇంకా పెంచాడు దర్శకుడు హరీష్ శంకర్. మరి ఈ సినిమాతో హరీష్ మళ్ళీ హిట్ ట్రాక్ లో పడతాడో లేదో చూడాలనుంటే సెప్టెంబర్ 13 వరకు ఆగాల్సిందే. అయితే పెద్దనాన్న పుట్టిన రోజు సందర్బంగా ఈ పాటను విడుదల చేస్తే మరో పది రోజుల్లో సెప్టెంబర్ రెండు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ట్రైలర్ రిలీజ్ చేస్తారని గుస గుసలు వినిపిస్తున్నాయి.   



మరింత సమాచారం తెలుసుకోండి: