తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి  జయలలితగారి  జీవితం ఆధారంగా  బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.    బాహుబలి రైటర్  విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో  తెరకెక్కుతున్న  ఈ చిత్రం  తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా  విడుదలకానుంది. ఈ బయోపిక్ లో  జయలలిత పాత్రలో  బాలీవుడ్ క్వీన్  కంగనా రనౌత్ నటిస్తోంది. అలాగే  ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు  ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఈ పాత్రలకు నటులను ఇటివలే ఫైనల్ చేసారు.  ఎం.జి.రామచంద్రన్  పాత్రలో  అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు మురళీ శర్మ నటిస్తున్నారు.  అయితే కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలని మొదట అనుకున్నా.. దర్శకుడు చివరికీ మురళీ శర్మ వైపు ఇంట్రస్ట్ చూపించాడు. ఇక  త్వరలోనే ఈ సినిమా షూట్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది.  జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానం  కూడా సినిమాలో  హైలెట్ చేస్తూ కథ ఉంటుందట.   కాగా ఈ బయోపిక్ బడ్జెట్  వంద కోట్లు అని తెలుస్తోంది.  


ఎలాగూ  కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.  ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా  ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.  కంగనా  రనౌత్ ను  అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు వస్తున్నారట.  హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన  'గ్యారీ ఓల్డ్ మెన్,  'అమ్మ' బయోపిక్  కూడా చెయ్యనున్నారు. జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే  కంగనా  రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి  న్యాయం జరుగుతుంది.  మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో  తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ  వార్తల్లో నిలిచే  కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను  ఎలా మెప్పిస్తోందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: