మెగాస్టార్ 151 వ సినిమా సైరా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను షురూ చేసుకుంది.  ఒకవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది.  మేకింగ్ వీడియో, టీజర్ లాంచ్ అయ్యాయి.  రెండింటికి డబుల్ రెస్పాన్స్ వచ్చింది.  ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.  64 ఏళ్ల వయసులో మెగాస్టార్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.  డూప్ లేకుండా చేయడం ఇక్కడ మరో విశేషం.  


దానికోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి.  ఈ కష్టానికి ప్రతిఫలం ఏంటి అన్నది అక్టోబర్ 2 వ తేదీన తెలుస్తుంది.  సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉన్నది.  ఎంత పెద్ద హిట్ కొడుతోంది అన్నది తెలియాలి.   ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇదిలా ఉంటె నాగబాబుకు మెగాస్టార్ విషయంలో ఓ కోరిక అలానే ఉండిపోయింది.  150 సినిమాలు రిలీజ్ అయ్యాయి.  అందులో ఎన్నో సినిమాలు వందరోజుల పండుగను చేసుకున్నాయి.  


మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో మెగాస్టార్ ఎప్పుడు ముందు ఉంటాడు.  రుద్రవీణ వంటి సామాజిక అంశంతో కూడిన సినిమాలు చేశారు.  జానపద సినిమాలు చేశాడు.  మాస్ మెప్పించే గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు చేశారు.  కానీ, ఇప్పటి వరకు అన్నయ్యకు ఒక్కసారి కూడా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు.  కారణం ఏంటి అన్నది తెలియదు. రుద్రవీణ సినిమాకు వస్తుందని అందరు అనుకున్నా... కొన్ని కారణాల వలన మిస్ అయ్యింది.  


చారిత్రాత్మక కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈసారైనా మెగాస్టార్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వస్తుందా అన్నది తెలియాలి.  ఇలాంటి సినిమాలను ప్రభుత్వం కూడా మెచ్చుకుంటుంది.  స్వాతంత్ర సమరయోధుల కథతో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా మెగాస్టార్ కు అవార్డు రావాలని కోరుకుందాం.  ఇది నాగబాబు కోరిక మాత్రమే కాదు.. మెగాస్టార్ ను అభిమానించే అభిమానులందరి కోరిక కూడా. ఈసారైనా కేంద్రం మెగాస్టార్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: