టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సాహూ’ అనే మాటే వినిపిస్తుంది. బాహుబలి 2 తర్వాత రెండు ప్రభాస్ తెరపై కనిపించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. రాజమౌళి తీసిన ‘బాహుబలి ’ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడ్డ విషయం తెలిసిందే.  ఆ సమయంలో ఏ సినిమాకు కమిట్ మెంట్ కాలేదు. ఇక యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు.  మొదటి నుంచి ప్రభాస్ తాను పడ్డ కష్టానికి మంచి ఫలితం వస్తుందన్న నమ్మకంపైనే సినిమాలు తీస్తున్నాడు.

బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి హోదా దక్కింది. ఇక ప్రభాస్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ సాహో. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.  తెలుగు, తమిళ, మళియాళ, హిందీ భాషల్లో భారీ ఓపెనింగ్ చేయబోతున్నారు.  ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా సాహూ రిలీజ్ కాబోతుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి నార్త్ లో కూడా మంచి క్రేజ్ పెరిగింది.

ఈ నేపథ్యంలో నార్త్ స్టేట్ లో చాలా మంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.   ఇక పంజాబ్ రాష్ట్రంలో కూడా ప్రభాస్ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అందులోనూ తెలుగు సినిమాలు రిలీజ్ కావడం అంటే కష్టమే. కానీ సాహో హిందీ ఫిల్మ్ ఒక బాలీవుడ్ స్టార్ హీరో రేంజ్ లో అక్కడ అంచనాలను రేపుతోంది.

దాదాపు పంజాబ్ లోని అన్ని ఏరియాల్లో సాహో విడుదల కాబోతోంది.  గతంలో బాహుబలి మూవీ కూడా ఇక్కడ భారీ స్థాయిలో రిలీజ్ అయి మంచి రికార్డులు క్రియేట్ చేసింది.  ఇప్పుడు ఇదే ఊపుతో సాహూ రెడీ అవుతుంది.  మొత్తానికి ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోతుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.  సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ నిర్మాతలు రూ.300కోట్ల బడ్జెట్ తో నిర్మించారు


మరింత సమాచారం తెలుసుకోండి: