ఒక సునామీ వచ్చిన తరువాత దాని ప్రభావం కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అలాగే పవన్ ‘అత్తారిల్లు’ మ్యానియా తో పవన్ తో గతంలో నటించిన హీరోయిన్స్ కు కూడా డిమాండ్ ఏర్పడుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పవన్ తో నటించి ప్రస్తుతం చాలామటుకు కనుమరుగైపోయిన పవన్ ఒకనాటి సినిమాల హీరోయిన్స్ నికీషా పటేల్, క్రితి కర్బందా, సారా జేన్ లాంటి ఒకనాటి బాలీవుడ్ బ్యూటీలకు ప్రస్తుతం సినిమాలు లేకపోయినా బొంబాయిలో చాలా మేగ్జైన్స్ కు పవన్ తో నటించిన హీరోయిన్స్ గా క్రెడిట్ కొట్టేస్తూ ఫోటో షూట్స్ కు అవకాశాలు కొట్టేస్తున్నారట. అదేవిధంగా ఐరన్ లెగ్ ఇమేజ్ తో ఉన్న శ్రుతిహాసన్ కు, ప్రణితకూ పవన్ తో నటించడంతో గోల్డెన్ లెగ్ హీరోయిన్స్ గా మారిపోయారు. ఈ నేపధ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గతంలో నటించిన నటీనటులకు అలాగే సాంకేతిక నిపుణులకు తాము పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసాము అని చెప్పుకోవడమే నేడు టాలీవుడ్ లో చాలా మందికి అవకాశాలు వెతుక్కోవడానికి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గా మారిపోయిందని, అదేవిధంగా చాలామంది దర్శకులు, నిర్మాతల వద్ద తాము పవన్ కళ్యాణ్ తో కొన్ని సినిమాలు చేసామని చెప్పుకుంటే చాలు గౌరవిస్తున్నారని కొందరు నటీనటులు భావిస్తున్న భావనలను చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ టాలీవుడ్ లో ఒక ప్రముఖ కన్సల్టెన్సీ గా మారిపోయిందని పవన్ ఇమేజ్ ఒక బ్రాండ్ ఇమేజ్ గా మారుతూ ఉండటంతో పవన్ తో నటించిన సహ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులుకు కూడా టాలీవుడ్ లో డిమేండ్ ఏర్పడటం పవన్ ఇమేజ్ కి చిహ్నంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: