దూకుడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ కాంబినేషన్ సీన్స్,  అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో...  'సరిలేరు నీకెవ్వరు'లో కూడా బండ్ల గణేష్ ట్రాక్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందట.   కాగా ఇప్పటికే బండ్ల షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. అవుట్ ఫుట్ చాలాబాగా వచ్చిందని తెలుస్తోంది.  ఇక బండ్ల గణేష్  చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది.  ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్  సినిమాతో మళ్లీ   సినిమాల్లోకి  రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమా మొత్తంలో మహేష్ తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది  బండ్ల గణేషేనట.  సూపర్ స్టార్ మహేష్ బాబు' - అనిల్ రావిపూడి  కాంబినేషన్ లో వస్తోన్న  ఈ సినిమా  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఒకరకంగా   ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ కూడా  చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.  ఓ  అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా  పప్పు సుద్దలా..  ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్ల గణేష్ నటిస్తున్నాడు. మెయిన్ గా బండ్ల హైలెట్ గా వచ్చే  రైలు సీక్వెన్స్   సినిమాలోనే  చాలా కీలకమైన ఎపిసోడ్ గా ఉంటుందట. 


కాగా   స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ  'సరిలేరు నీకెవ్వరు' టీమ్‌ విడుదల చేసిన   వీడియో సాంగ్  సోషల్ మీడియాలో బాగా వైరల్  అయింది.  'భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా... జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు... ' అంటూ భారత సైనికుల ధైర్యాన్ని తెలియజేస్తూ సాగింది ఈ పాట. వ్యూస్ పరంగా కూడా ఈ పాట కొత్త రికార్డ్స్ ను సృష్టింది. అలాగే  'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ గెటప్ మారినా లుక్ మాత్రం మారదట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన  రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది.   అలాగే ప్రకాష్‌ రాజ్‌ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న  ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.  దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో  రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం  షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది.  2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: