తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ ఐదో వారం రన్ అవుతుంది. గత వారం టివి నటి రోహణి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈసారి ఎలిమినేషన్ రౌండ్ చాలా చిత్ర విచిత్రంగా జరిగింది.  అంతే కాదు ఈవారం ఇంటి సభ్యుల మద్య తమాషా గేమ్స్ తో పాటు తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకునే వేధిక ఏర్పాటు చేశారు బిగ్ బాస్.

ఇందులో ఎక్కువగా అలీ, రవికృష్ణ, మహేష్, వరుణ్ వారి ప్రతిభను నిరూపించుకున్నారు.  అమ్మాయిలు కూడా సాధ్యమైనంత వరకు పర్ఫామెన్స్ ఇరగదీశారు.  అయితే అలీ చేసిన ఓ స్కిట్ మాత్రం అందరికీ కన్నీరు తెప్పించింది..ఈ వారం సెలబ్రెటీని చేసింది. మొన్నటి వరకు ఎంతో ఉత్సాహ పరిచారో నిన్నటి ఎపిసోడ్ లో అంత చింతరవంద చేశారు బిగ్ బాస్. దాదాపు ఇంటి సభ్యుల మద్య పెద్ద గొడవే సృష్టించారు. స్‌లో గ్రూప్‌గా ఉన్న పునర్నవి, రాహుల్, వితికా, వరుణ్‌ల మధ్య బిగ్ బాస్ కారణంగా గొడవ వచ్చింది. 

పునర్నవి కోసం.. వితికా, వరుణ్, రాహుల్ గుసగుసలాడిన వీడియోలను కన్ఫెషన్ రూంలో పునర్నవికి సీక్రెట్‌గా ప్లే చేసి చూపించారు బిగ్ బాస్. అంతే ఆ వీడియో చూసిన పునర్నవి హర్ట్ అయ్యింది..తనతో స్నేహంగా ఉంటూనే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా అంటూ తెగ బాధపడిపోయింది. అంతే కాదు తన బాధను  రాహుల్ వద్ద తన బాధను చెప్పుకొని బాధపడింది. 

అనంతరం శ్రీముఖిని సీక్రెట్ రూంలోకి పిలిచిన బిగ్ బాస్.. ఆమెకోసం పునర్నవి, రాహుల్, వితికాలు ఎలా మాట్లాడుకున్నారో వీడియో ప్లే చూసి చూపించారు. అంతే ఆ వీడియో చూసి శ్రీముఖి ఒక్కసారే కుంగిపోయింది..ఛీ తనపై ఇంత కుట్రనా అని ఎమోషన్ అయ్యింది.  ఇక హిమజకు బిగ్ బాస్ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులకు తాను విలన్ గా మారాలని..అలా చేస్తే  ఇమ్యునిటీ లభిస్తుందని చెబుతారు. ఆ క్షణం నుంచి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు హిమజ చుక్కులు చూపించినా..టాస్క్ సరిగా చేయకపోవడంతో ఇమ్యూనిటీ కోల్పోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: