యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో. ఈ నెల 30 రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ చిన్ననాటి స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మాతలు అవడం వల్ల ప్రభాస్ స్పెషల్ ఇంట్రెస్ట్ మీద సాహో ప్రమోషన్స్ చేస్తున్నాడు.


తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ, హింది పరిశ్రమల్లో సాహో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. భారీ యాక్షన్ సీన్స్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అంటున్నారు. నిర్మాతలు స్నేహితులే అవడం వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత అంతా మీద వేసుకున్నాడు ప్రభాస్.


బాలీవుడ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా చాలా వరకు ప్రభాస్ ఒక్కడే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అతనితో పాటు శ్రద్ధా కపూర్ కూడా ఉంది. దర్శకుడు సుజిత్ ఎక్కడ కనిపించడం లేదు. బాహుబలితో బాలీవుడ్ లో ప్రభాస్ కు ఒక మార్కెట్ వచ్చింది. అయితే ఆ వెంటనే సాహో అంటూ వస్తూ ఆ ఇమేజ్ రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నాడు. 


బాలీవుడ్ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికి ఇంటర్వ్యూస్ ఇస్తూ సాహోని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు ప్రభాస్. అతని ప్రమోషన్స్ చూసి బాలీవుడ్ హీరోలు కూడా అవాక్కవుతున్నారు. సినిమా ఏదో చేశామా ఆడియెన్స్ మీదకు వదిలామా అన్నట్టు కాకుండా ప్రభాస్ కు సినిమా మీద ఉన్న్ ప్యాషన్ ఏంటో అర్ధమవుతుంది. సాహో హిట్టయితే మాత్రం అతను పర్మినెంట్ నేషనల్ స్టార్ గా ఉండిపోతాడు. మరి అది సాహోతో సాధ్యమా కాదా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: