భక్త కన్నప్ప 1976న రిలీజ్ అయింది, క్రిష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి కళాత్మక దర్శకుడు బాపు డైరెక్షన్ చేశారు. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీతో క్రిష్ణంరాజు  సూపర్ స్టార్ డమ్  కూడా సంపాదించుకున్నారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ అలరిస్తూంటాయి. ఇదిలా ఉండగా నలభయ్యేళ్ళ క్రితం వచ్చిన భక్త కన్నప్ప కంటే ఈ నాటి కాలంలో ఇంకా బాగా ఈ మూవీని తీయవచ్చు.


అటువంటి ఆలోచన క్రిష్ణంరాజు నట వారసుడు ప్రభాస్ కి వచ్చింది. బెంగుళూరు లో సాహో ప్రమోషన్లో భాగంగా మీడియాతో  మాట్లాడినా ప్రభాస్ భక్త కన్నప్ప మూవీని త్వరలో  చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీని తన పెదనాన్న భక్తితో చేశారని, దానికి ఇన్సిపిరేషన్ కూడా కన్నడ రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తి మహత్స్యం అని చెప్పుకొచ్చాడు.


భక్త కన్నప్ప తన డ్రీమ్  ప్రాజెక్ట్ అని కూడా ప్రభాస్ చెప్పాడు. ఈ మూవీని ఎపుడు చేస్తానో తెలియదు కానీ చేసి తీరుతానని ప్రభాస్ అనడం ద్వారా ఫ్యాన్స్ లో కొత్త ఆశలే రేపారు. ఈ మూవీ చేయాలంటే క్రిష్ణంరాజు తరువాత ప్రభాసే సూటబుల్ అని అంతా ఒప్పుకుంటారు. బాహుబలిలో శివతాండవం చేసిన ప్రభాస్  శివలింగాన్ని ఎత్తి పట్టుకుని ముందుకు సాగిన సన్నివేశం గుర్తు తెచ్చుకుంటే ఆయన శివభక్తుడిగా తప్పక  అలరిస్తారని చెప్పవచ్చు.


ఇక బాహుబలి తరువాత విజువల్ వండర్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్న  క్రమంలో భక్త కన్నప్ప కూడా ఈ జనరేషన్ కి తగినట్లుగా నిర్మిస్తే అదుర్స్ అన్నట్లుగా తయారవుతుంది. అంతే కాదు  నేషనల్, ఇంటర్నేషన్ కాన్వాస్ మీదకు  కూడా విస్తరించగల కెపాసిటీ భక్త కన్నప్ప కధకు  ఉందని అంటున్నారు. మరి క్రిష్ణంరాజు స్వీయ దర్శకత్వంలో  ప్రభాస్ తో ఈ సినిమా నిర్మిస్తానని అప్పట్లో చెప్పారు. మరి ఇపుడు ఆయన డైరెక్ట్ చేస్తారా లేక రాజమౌళి లాంటి వారు చేస్తారా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: