ఉత్తరాదిన ఇప్పటికే పాగా వేసిన బీజేపీ, అటు నార్త్ ఇండియాలో కూడా చాలా వరకు తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.  ఇప్పుడు అక్కడ బీజేపీ జెండా ఎగురుతోంది.  ఉత్తరాదిన సక్సెస్ సాధించిన బీజేపీ చూపులు ఇప్పుడు దక్షిణాదిపై పడ్డాయి.  దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నది.  ఇందులో భాగంగానే.. ఆంధ్రప్రదేశ్ లోని బిగ్ స్టార్స్ ను పార్టీలోకి లాగాలని చూస్తున్నది.  


తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు ఉన్నది.  2007 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.  అయితే, 2008 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ కేవలం 18 స్థానాలు దక్కించుకోవడం ఆ తరువాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ప్రజారాజ్యం పార్టీ చరిత్ర కేవలం మూడు సంవత్సరాల్లోనే ముగిసిపోయింది.  


ఆ తరువాత మెగాస్టార్ 2015లో తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్టైంది.  ఇప్పుడు సైరా సినిమా చేస్తున్నాడు.  రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.  కానీ, మెగాస్టార్ ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి తిరిగి ప్లాన్ చేస్తున్నారు.  బీజేపీ డైరెక్ట్ గా చిరంజీవి అప్రోచ్ అయ్యి రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.  కానీ, మెగాస్టార్ మాత్రం అందుకు సిద్ధంగా లేరని సమాచారం.  


చిరంజీవి ససేమిరా అనడంలో గంటా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.  తెలుగుదేశం పార్టీలో ఉన్న గంటా శ్రీనివాసరావు.. బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.  అయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నది.  ఆ ప్రచారానికి తగ్గట్టుగానే గంటా త్వరలోనే బీజేపీలో జాయిన్ కాబోతున్నారు.  అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయితే, స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టే గంటా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. స్పీకర్ గా తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. 

బహుశా అందుకే గంటా తదితరులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇప్పుడు గంటా ద్వారా చిరంజీవితో రాయభారం నడుపుతున్నది.  మెగాస్టార్ తో గంటా భేటీ వెనుక అసలు ఉద్దేశ్యం కూడా ఇదే అని అంటున్నారు విశ్లేషకులు.  ఒకవేళ చిరంజీవి బీజేపీలో జాయిన్ అయితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని నియమిస్తారని టాక్ వస్తోంది.  చూద్దాం ఏం జరుగుతుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: