మొన్నటివరకు బాలీవుడ్ సినిమాలంటే ఖాన్ ల అడ్డా, ఎప్పుడైతే అక్కడ బాహుబలి ఎంట్రీ ఇచ్చి రికార్డులు సృష్టించిందో సీన్ మారింది. అంతకుముందు అక్కడ మమ్మల్ని కొట్టే మొనగాళ్లే లేరు అనుకునేవారు. కానీ ఇపుడు సీన్ మారింది. బాహుబలి మానియా ఖాన్ ల క్రేజ్ ఒక్కసారి తగ్గించలేకపోయినా ఆ ప్రభావం కనిపిస్తుంది.
బాహుబలి తర్వాత మళ్ళీ అటువంటి రికార్డులు కొట్టేయాలని తంటాలు పడిన అమిర్ ఖాన్ అనుకున్నది చేయలేకపోయాడు. అమితాబ్ సహా భారీ కాస్టింగ్ తో అమిర్ ఖాన్ చేసిన దగ్స్ అఫ్ హిందుస్థాన్ ఎంతో దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈమధ్య షారుఖ్ సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్నాయి. మరోవైపు సల్మాన్ భారత్ పరవాలేదని అనిపించినా ఆశించిన వసూళ్లు సాధించలేదు.


ఇక ఇదే మంచి తరుణం టాలీవుడ్ బాలీవుడ్ పై పట్టు సాధించేందుకు అని అంటున్నారు. ఇప్పుడు సైరా నరసింహ రెడ్డి, సాహో సినిమాలు ఇప్పుడు బాహుబలి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ పై టాలీవుడ్ దృష్టిసారించింది . త్వరలో విడుదల కానున్న ఈ రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తే టాలీవుడ్ రేంజ్ ని పెంచినట్లు అవుతుంది. ఇకపోతే ఈ మ‌ధ్య వ‌స్తున్న చిత్రాలన్నీదాదాపుగా పెద్ద బ‌డ్జెట్‌తో వ‌స్తున్నాయి. అన్ని చిత్రాలు దాదాపుగా బాలీవుడ్‌కి ధీటుగా తెర‌కెక్కుతున్నాయి. గ‌తంలో కూడా తెలుగులో ఎన్నో మంచి చిత్రాలు తెర‌కెక్కాయి. కానీ ఇంత మంచి క్రేజ్ తో పాటు బ‌డ్జ‌ట్ కూడా పెర‌గ‌డంతో తెలుగు చ‌ల‌న చిత్రానికి ఇంత‌టి స్థాయి పెరిగింది.


ఇక‌పోతే చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. రూ.  200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. బాహుబలి సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. బాహుబలి2 తర్వాత అతడి గురించి ఏ చిన్న వార్త వినిపించినా ట్రెండ్ అయ్యింది. ప్రభాస్ పెళ్లి, తదుపరి సినిమా.. ఇలా ప్రతీది వైరలైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో ప్రభాస్‌ రూ.2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: