పవన్ తమ్ముడిగా మారిపోయిన హీరో నితిన్ తన సినిమాలలోనే కాకుండా అనునిత్యం పవన్ నామస్మరణ తో పవన్ కు నిజమైన తమ్ముడిగా పేరు సంపాధించుకుంటున్నాడు హీరో నితిన్. ఈ మధ్యనే తన తండ్రి ద్వారా కొనిపించిన పవన్ ‘అత్తారింటికి దారేది’ నితిన్ ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తోంది. కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం సినిమా వాళ్లకు ఉన్న అలవాటు అది మామూలే. అలా కానుకలు అందుకోవడంలో వాళ్ళు పొందే ఆనందం మాత్రం చెప్పలేనంత స్థాయిలో వుంటుంది.  ఇప్పుడు టాలీవుడ్ లవర్‌బాయ్ నితిన్ కూడా ఓ కానుక విషయంలో అలాంటి ఆనందాన్నే పొందుతున్నాడు. ఎందుకంటే, ఆ గిఫ్ట్‌ని అందుకున్నది దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్య లావణ్య ఇచ్చింది కాబట్టి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం నితిన్‌తో 'హార్ట్ ఎటాక్' పేరిట తమ సొంత బ్యానర్‌పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో లావణ్య ఈ హీరోకి ఒక మoచి 'ఐ ఫోన్' ను దీపావళి కానుకగా ప్రెజెంట్ చేసిందట. ఈ గిఫ్ట్ ను చూసి హీరో నితిన్ తెగ మురిసిపోతున్నాడట. గతంలో పూరీకి బండ్ల గణేష్ ఖరీదైన డైమండ్ లైటర్ బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో ఆ గిఫ్ట్ ను చూసి పూరీ తెగ మురిసిపోయాడు. ఇప్పుడు పూరీ భార్య ఇచ్చిన బహుమతిని చూసి నితిన్ ఖుషీ అయిపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: