బిగ్‌బాస్ సీజన్ 3 విజయవంతంగా 35 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని 36వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం నాడు హోస్ట్ కింగ్ నాగార్జున మంచి ఊపున్న సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లో ఆదివారం సందడి మొదలైంది. నాగార్జున ఎప్ప‌టిలాగానే కొత్త కొత్త గేమ్స్‌తో ఇంటి స‌భ్యుల‌ను ఆడించారు. ఈ క్ర‌మంలోనే శివ జ్యోతికి నాగార్జున ఓ టాస్క్‌ ఇచ్చారు. ఒక్కో జంతువు ఒక్కొక్కరికి అనే టాస్క్‌లో భాగంగా.. జ్యోతి స్టోర్ రూమ్‌లో ఉన్న జంతుల మాస్కుల‌ను తీసుకువ‌చ్చింది. 


అయితే నాగార్జున చదివి వినిపించే జంతువు స్వ‌భావం ఏ ఇంటి స‌భ్యుడికి స‌రిపోతుందో.. ఆ స‌భ్యుడికి ఆ జంతువు మాస్క్‌ శివ జ్యోతి పెట్టాలి. ఈ క్ర‌మంలోనే సింహం మాస్క్‌ను మృగరాజుగా అలీ రెజాకి పెట్టింది. జిత్తులమారి నక్క మాస్క్‌ని మ‌హేష్ విట్ట‌, భ‌య‌ప‌డే జింక రాహుల్‌, అతిగా తినే ఏనుగు హిమ‌జ‌, కోతి చేష్ట‌లు చేసి కోతి శ్రీ‌ముఖి, రంగులు మార్చే ఊస‌ర‌వెల్లి బాబా భాస్క‌ర్‌, విశ్వాసం ఉన్న శున‌కం ర‌వి కృష్ణ‌, ప‌గ‌బ‌ట్టే పాము అషు, నెమ్మ‌దిగా ఉండే తాబేలు వ‌రుణ్, కుందేలు పున‌ర్న‌వి మ‌రియు గొర్రె పిల్ల వితికా ఇలా వారి స్వ‌భావం బ‌ట్టీ జంతులు మాస్కుల‌ను ఇచ్చింది.


ఈ టాస్క్ పూర్తి అయిన త‌ర్వాత మ‌రో ఫ‌న్నీ ట‌స్క్‌ను నాగార్జున ఇచ్చారు. 12 మందిని ఆరు జంటలుగా విభజించిన‌ నాగార్జున.. ఈ జంటలు ఒకరు మరొకరిలా నటించాల‌ని చెప్పారు. ఈ టాస్క్‌లో ఇంటి స‌భ్యులంద‌రూ ఎంతో ఫ‌న్నీగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆనందింప‌జేశారు. సన్‌‌డేను ఫన్‌డేగా మార్చి చకచకా గేమ్స్ ఆడిస్తూ మరోవైపు డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో ఒక్కొక్కరిని సేఫ్ జోన్‌లో వేస్తున్న నాగార్జున చివ‌ర‌కు అషురెడ్డిని ఎలిమినేట్ చేశారు. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి అషు రెడ్డి ఎలిమినేట్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: