మెగా వారసుడు వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుందా.. ఈ సినిమాలో వరుణ్ కి జోడి కట్టింది ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ పూజ హెగ్డే.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులలో ఒక మంచి పేరును సంపాదించింది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చింది. ముకుందా తర్వాత వచ్చిన సినిమా అక్కినేని నాగచైతన్య ఒక లైలా కోసం.. ఈ సినిమాలో చైతు డైలాగులతో, అయన ఆటిట్యూడ్ తో సినిమాను మరో స్థాయి తీసుకెళ్లాడు. దానితో ఇంకా చెప్పనక్కర్లేదు సినిమా హిట్ ట్రాక్ మరో రేంజుకు వెళ్ళింది.

పూజ హెగ్డే ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వచ్చింది. ఆ సినిమాలు ఆమెకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయాయి. మాములుగా చేస్తే ఆఫర్లు రాలేదని అనుకుందో ఏమో.. అల్లుఅర్జున్ సినిమా లో కాస్త ఓవర్ గా అందాలను ఆరబోస్తూ మరి చూపించిన కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇకపోతే  ఎన్టీఆర్ సరసన అరవింద సమెత సినిమాలో నటించింది. ఈ సినిమా అమ్మడుకు కాస్త కాసుల వర్షాన్ని కురిపించిందనే చెప్పాలి. మొన్న ఆమధ్య వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా కూడా మంచి పేరు వచ్చింది.

తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సరైన హిట్ లేకపోయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు అనే విషయం తెలిసిందే. ఐరన్ లెగ్ హీరోయిన్ అనే టాక్ సొంతం చేసుకున్న పూజ ఇప్పుడు మరో సినిమాలో కూడా నటిస్తుంది.ఆ సినిమా విషయానికొస్తే.. ముకుందా సినిమాతో సక్సెస్ ఫుల్ జోడి అని ముద్ర వేసుకున్న జోడి.. వరుణ్ తేజ్, పూజ హెగ్డే.. ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న చిత్రం వాల్మీకి.ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న ఆమధ్య రిలీజ్ అయిన ఆ చిత్ర టీజర్ ప్రజల్లో మంచి మార్కులను వేయించుకుంది. అందులో భాగంగా చిరు బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయిన జర్రా జర్రా సాంగ్ అందిరిచేత విజిల్స్ వేయించుకుంది. ఇకపోతే తాజాగా నిన్న ఈ సినిమాలోని పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు ఆ చిత్ర యూనిట్. 

శ్రీదేవి పాత్రలో ఈ బ్యూటీ కనిపించనుంది. ఆ పోస్టర్ లో పూజ సైకిల్ పై వెళ్తున్న ఒక విలేజ్ అమ్మాయిలా కనిపిస్తుంది. నిజానికి ఈ వాల్మీకి చిత్రం తమిళ్ ల్లో వచ్చిన 'జిగర్తాండా' అనే సినిమాకు రిమేక్‌. సీనియర్ నటినటీమణులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌‌పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న థియేటర్లలో సందడి చేయనుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో ఎలా కనిపిస్తుంది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే మరి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: