టాలీవుడ్ లోకి రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  మొదటి సినిమా మాస్ ఎటిమెంట్స్ తో రూపొందింది. ఈ మూవీ కమర్షియల్ గా పెద్దగా హిట్ కాకున్నా ప్రభాస్ నటనకు మంచి కితాబు ఇచ్చారు.  ఈ తర్వాత వచ్చిన సినిమాలతో  పెద్దగా ఆకర్షించలేకపోయాడు ప్రభాస్.  కాకపోతే శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష జంటగా వచ్చిన ‘వర్షం’మంచి హిట్ అయ్యింది.  ఈ మూవీలో ప్రస్తుతం యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ విలన్ గా నటించాడు. 

దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘చత్రపతి’సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా ప్రభాస్ సినీ కెరీర్ ని బ్రంహాండంగా మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్, డాల్లింగ్, మిర్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి.  మరోసారి రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో ‘బాహుబలి, బాహుబలి 2’ సినిమాల వచ్చాయి.  ఈ సినిమాలతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్‌లుగా వెలుగొందుతున్న వారికి కూడా సాధ్యం కాని రికార్డులను సునాయాసంగా అందుకుంటున్నాడు. 

ప్రస్తుతం ప్రభాస్ నటించే ప్రతి సినిమా జాతీస్థాయిలోనే రూపొందబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్-శ్రద్దా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ ఈ నెల 30 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ జోరుగా కొనసాగిస్తున్నారు చిత్రయూనిట్.  ఈ మూవీ తెలుగు, మళియాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్నాయి.  ప్రభాస్ అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తూ ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..`కెరీర్ ప్రారంభమైన తొలి రోజుల్లో హీరోగా నాకు గుర్తింపు వస్తే చాలనుకునేవాణ్ని.

`వర్షం` హిట్ అయ్యాక.. హమ్మయ్య విజయం వచ్చింది అనుకున్నాను. `ఛత్రపతి`నాకు క్లారిటీ ఇచ్చింది.  అప్పటి వరకు తాను ఎంచుకున్న సినిమాలు పెద్దగా సక్సెస్ కాకున్నా..తర్వాత తను ఎంచుకున్న సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. సరైన దారిలోనే వెళుతున్నాననే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇప్పుడున్న స్థానాన్ని కలలో కూడా ఊహించలేద`ని ప్రభాస్ అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: