విజయ్ దేవరకొండతో తాను రాబోతున్న రెండు సంవత్సరాలలో ఒక్క సినిమా కూడ నటించను అంటూ స్వయంగా రష్మిక ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ క్రేజీ బ్యూటీ నిన్న తన అభిమానులతో ఛాట్ చేస్తున్న సందర్భంలో తనకు ఎదురైన ఒక ప్రశ్న పై రష్మిక ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

రష్మిక విజయ్ ల కాంబినేషన్ ను మళ్ళీ ఎప్పుడు చూడబోతున్నాము అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘డియర్ కామ్రేడ్’ మూవీలో తామిద్దరం మరొకసారి కలిసి నటించినందుకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ జ్ఞాపకాలు తమ ఇద్దరినీ కనీసం రెండు సంవత్సరాలు వెంటాడతాయని ఆ జ్ఞాపకాలు చాలు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు తమ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ అనేక మంది వేసిన సెటైర్లతో తాము పడ్డ బాధ తమకు మాత్రమే తెలుసు అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

దీనితో విజయ్ రష్మికల కాంబినేషన్ లో మరొక సినిమా మరో రెండు సంవత్సరాల వరకు రాదు అని స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు అయింది. వాస్తవానికి ‘గీతాగోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ మూవీలకు ఏర్పడిన క్రేజ్ వెనుక వీరిద్దరి కాంబినేషన్ ఆ సినిమాల క్రేజ్ ను ఎంతో పెంచింది అన్నది నిజం. 

అయితే విజయ్ తో రష్మిక లవ్ కెమిస్ట్రీ పై వారిద్దరి లిప్ లాక్ సీన్స్ పై రష్మికకు కన్నడ మీడియా నుండి మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల నుండి కూడ తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యతిరేకతను పెంచే ఉద్దేశ్యం లేక రష్మిక ఈనిర్ణయం తీసుకుందా లేకుంటే రష్మిక రేంజ్ మిడిల్ హీరోయిన్ స్థాయి నుండి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతున్న నేపధ్యంలో ఇలా వ్యూహాత్మకంగా విజయ్ ని పక్కకు పెట్టిందా అన్నవిషయాలు సమాధానం లేని ప్రశ్నలు..


మరింత సమాచారం తెలుసుకోండి: