మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ‘చూడాలని ఉంది’ ఒకటి. 1998 ఆగష్టు 27న విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 21 ఏళ్లు. చిరంజీవి-అశ్వనీదత్ కాంబినేషన్ లో అంతకుముందు వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ హిట్. మళ్లీ ఈ కాంబినేషన్ లోనే వచ్చిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  కొడుకు కోసం తపన పడిన తండ్రిగా చిరంజీవి నటనకు ప్రజలు ఫిదా అయ్యారు. 



వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా కోసం కలకత్తా హౌస్ సెట్ ను కోటి రూపాయలతో నిర్మించారు. అప్పటికి తెలుగులో భారీ సెట్ గా రికార్డు సృష్టించింది. ఈ సెట్ లో షూటింగ్ చేయటానికి తొలిసారిగా టాలీవుడ్ లో అకేలా క్రేన్ ను భారీ ఖర్చుతో ముంబై నుంచి తెప్పించారు. ఈ సినిమాలోని పాటలన్నీ మ్యూజికల్ హిట్సే. టాలీవుడ్ లో మణిశర్మను చూడాలని ఉంది మ్యూజిక్ డైరక్టర్ అనే కొన్నేళ్లపాటు పిలుచుకున్నారు. చిరంజీవిని ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సీన్లో ప్రేమికుడిగా చూపి దర్శకుడు గుణశేఖర్ మెప్పించారు. ఆ సీన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. నల్లమల అడవుల్లో భారీ చేజింగ్ సీన్లు తీశారు. 



అప్పటివరకూ ఉన్న ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. 62 డైరక్ట్, 7 సెంటర్లు షిఫ్టింగ్ తో 100 రోజులు ఆడింది. విజయవాడ అప్సర ధియేటర్ లో 175 రోజులు రన్ అయింది. కర్నూలులో నిర్వహించిన ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో టెక్నీషియన్లకు చిరంజీవి గోల్డ్ చెయిన్స్ బహుకరించారు. హిట్లర్, మాస్టర్, బావగారూ బాగున్నారా.. హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత వచ్చిన చూడాలని ఉంది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాలుగు వరసు హిట్లు సాధించి మెగాస్టార్ తన స్టామినాను నిరూపించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: