న్యాచురల్ స్టార్ నాని.. ఈ పేరులోనే ఎంత వినయం కనిపిస్తుందో.. అతను కూడా అంతే వినయస్తుడు అన్న విషయం వేరేలా చెప్పనక్కర్లేదు. రేడియో జాకీ గా తన జీవితాన్ని ప్రారంభించిన, ఆ తర్వాత ఎన్నో ఒడిదుగులను ఎదుర్కొన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసాడు. అష్టచమ్మా సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన నాని ఆ సినిమా విజయంతో, వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. ఈయన ఎంచుకునే కథలు అన్ని ఫ్యామిలీ ఎంటెర్టానర్గా తెరకెక్కినవే కావడం విశేషం. ఇకపోతే అయన సినీ కెరియర్లో ఏ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయో చూద్దాము.. 

అష్టాచమ్మా .. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన, ఈ సినిమాలో నాని హీరో. కలర్ స్వాతి హీరోయిన్. ఈ సినిమా మొత్తం మహేష్ అంటే ఇష్టం ఉన్న కుటుంబం వారి మధ్య సంబంధ బాంధవ్యాలు మధ్యన సాగిన ఈ సినిమా నాని కి అనుకోని విదంగా హిట్ ను అందించింది. ఆ తర్వాత వచ్చిన రైడ్, స్నేహితుడా సినిమాలు అతనికి అనుకున్న రిజల్ట్ ను అందించలేక పోయింది. భీమిలి కబడ్డీ జట్టు .. ఈ సినిమా మొత్తం కబడ్డీ అంటే పిచ్చి ఉన్న కుర్రాళ్లు చేసే ప్రయత్నాలు ఈ సినిమాలో చూపిస్తారు. హీరోయిన్ శరణ్య కూడా ఎంతో చక్కగా నటించింది. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

అలామొదలైంది.. ఈ సినిమా నానికి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ట్రాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. స్నేహ ఉల్లాల్, నిత్యామీనన్ కథానాయకులు. పిల్ల జమిందార్.. ఈ సినిమా కూడా నానికి మంచి పేరును తీసుకొచ్చిందని చెప్పాలి. డబ్బులేకున్నా కూడా మనిషి విలువలు ఏంటంటనేది ఈ సినిమాలో చూపించారు. ఆ తర్వాత ఈగ సినిమాలో నటించారు. చేసిన పాత్ర చిన్నదే అయినా కూడా అవార్డులను అందించిన సినిమాగా, రాజమౌళి చేసిన ఈ సాహసం ప్రపంచపు అంచులు కూడా పాకింది. 

ఆలా నాని ఎక్కడ వెనకడుగు వేసుకొనే పరిస్థితి ఏర్పడలేదని చెప్పాలి. వరుస సినిమాలలో నటించి హ్యాట్రిక్ రికార్డులను కైవసం చేసుకున్న నాని గొప్ప స్టార్ గా ఎదిగాడు. నిన్ను కోరి, నేను లోకల్, మజ్ను, జెంటిల్మ్యాన్, కృష్ణగాడి వీర ప్రేమగాద, భలే భలే మగాడివోయి, ఈ సినిమాలు అన్ని వరుస విజయాలు అందుకున్న సినిమాలే. కాగా, ఆ నాని 25 వ చిత్రంగా వచ్చిన జెర్సీ సినిమాలో నాని ఒక మంచి క్రికెట్ ఆటగాడిగా కనిపించి అందరి చేత మంచి మరుక్కులు వేయించుకున్నారు. తాజాగా నాని, గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమాలో నటించనున్నారు. ఈ తర్వాత నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వహణ కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. 
చూసారుగా కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందని. దానికి ఉదాహరన్ నాని. ఆర్ జె గా మొదలుకొని , అసిస్టెంట్ నుండి, హీరోగా , ప్రొడ్యూసర్ గా కూడా చేసాడు. కష్ట పడింది ఊరికే పోదు, ఊరికే వచ్చింది ఎప్పటికి మనతో ఉండదు అని స్పష్టంగా అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: