ప్రస్తుతం భారతీయ చలన చిత్ర రంగంలో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి క్రీడారంగానికి రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలు వెండితెరపై తెరకెక్కిస్తున్న క్రమంలో తాజాగా దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. వాజ్ పేయి జీవిత కథ ఆధారంగా దేశానికి మరియు బిజెపి పార్టీకి ఆయన చేసిన సేవలు ఆయన నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం సమయములో వాజ్ పేయి వ్యవహరించిన తీరును ఆధారం చేసుకుని సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉల్లేక్ అనే రచయిత వాజ్ పేయి జీవితం చరిత్రపై ' ది అన్ టోల్డ్ వాజ్ పేయి' అనే పుస్తకాన్ని రచించారు. అమాష్ ఫిలిమ్స్ అనే సంస్థ ఈ పుస్తక హక్కులని సొంతం చేసింది.


ఈ పుస్తకం ఆధారంగా వాజ్ పేయి బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు సంస్థ నిర్మాతలు శివ శర్మ, జీషాన్ ప్రకటించారు. వాజ్ పేయి బాల్యం నుంచి విద్యాబ్యాసం, రాజకీయ నాయకుడిగా, ప్రధానిగా సాధించిన విజయాలు ఇలా అన్ని అంశాలని సినిమాలో చూపిస్తాం అని అంటున్నారు. ఈ బయోపిక్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగానే దర్శకుడు, నటీ నటుల్ని ప్రకటిస్తామని తెలిపారు. అటల్ బిహారి వాజ్ పేయి బిజెపి పార్టీ లో చాలా కీలకంగా వ్యవహరించారు.


సంఘ పరివార్ కి చెందిన పెద్దలు ఏ మాత్రం తన హయాంలో ప్రభుత్వ విధానాలలో జోక్యం చేసుకోకుండా చాలా చక్కగా పరిపాలించారు. ఇప్పుడున్న పరిపాలనకు అనగా ప్రస్తుతం బీజేపీ పాలకులకు భిన్నంగా అందరిని ఒకేలా చూస్తూ రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులను మట్టి కురిపిస్తూ అటల్ బిహారి వాజ్ పేయి అద్భుతమైన పరిపాలన తన హయాంలో దేశానికి ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో దివంగత అటల్ బిహారి వాజ్ పేయి జీవితం గురించి సినిమా వస్తున్న తరుణంలో అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా రంగంలోనూ ఈ వార్త సంచలనం అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: